Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఘోరం... జీతం అడిగాడని నోట్లో...!

అవును... తాను పని చేసిన 15 రోజులకు గాను జీతం అడిగాడన్న కారణంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు ఘోరానికి ఒడిగట్టింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:50 AM GMT
గుజరాత్  లో ఘోరం... జీతం అడిగాడని నోట్లో...!
X

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్నట్లుగా మారిపోతున్నారు కొందరు మనుషులు. డబ్బుందన్న అహంకారమో.. తమవద్ద పనిచేసే ఉద్యోగి ఏమి చేస్తాడులే అనే ధైర్యమో.. డబ్బు మాయలో మాయమైన మానవత్వ ఫలితమో తెలియదు కానీ... తమ వద్ద పనిచేసే వ్యక్తి జీతం అడిగాడని అత్యంత అమానవీయంగా ప్రవర్తించి ఒక యజమానురాలు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది.

అవును... తాను పని చేసిన 15 రోజులకు గాను జీతం అడిగాడన్న కారణంతో ఓ ఉద్యోగిపై సంస్థ నిర్వాహకురాలు ఘోరానికి ఒడిగట్టింది. ఇందులో భాగంగా అతడి నోట్లో చెప్పుపెట్టి.. క్షమాపణ చెప్పేంత వరకు వదలకుంది. అంతేకాకుండా డబ్బు దోచుకోవడానికి వచ్చానని బలవంతంగా అతడితో చెప్పించి వీడియో కూడా తీయించింది! కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా వైరల్ గా మారింది. ప్రస్తుతం వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది.

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్‌ లోని మోర్బిలో విభూతి పటేల్‌ అనే మహిళ ‘రాణిబా ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట టైల్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో నీలేశ్‌ దల్సానియా అనే 21 ఏళ్ల యువకుడ్ని మార్కెటింగ్‌ కోసం నియమించుకున్నారు. ఇతడికి నెలకు రూ.12 వేల జీతం ఫిక్సయ్యింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి అక్టోబర్‌ 18న అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.

దీంతో తాను పని చేసిన 15 రోజుల జీతాన్ని ఇవ్వాల్సిందిగా అతడు పలుమార్లు కోరాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కూడా ఫలితం లేకపోవడంతో తన సోదరుడితోపాటు మరో వ్యక్తితో కలిసి సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. దీంతో విభూతి పటేల్‌ తన సోదరుడికి ఫోన్‌ చేసి రప్పించింది! ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో నీలేశ్‌ ను టెర్రస్‌ మీదకి ఈడ్చుకుంటూ వెళ్లిన విభూతి పటేల్‌.. నోట్లో చెప్పు పెట్టి, క్షమాపణ చెప్పమన్నాడు.

ఈలోగా సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా ఆమెకు వత్తాసు పలుకుతూ.. నీలేశ్‌ తరఫున వచ్చిన వారిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో... అక్కడి నుంచి బయటకు వచ్చి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు నీలేశ్. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రాథమిక విచారణలో దాడి నిజమేనని తేలిందని స్థానిక డీఎస్పీ చెబుతున్నారు.