ఇది కదా లాటరీ తగలటమంటే? రూ.10వేల కోట్ల జాక్ పాట్
కాలిఫోర్నియాలోని కాటన్ వుడ్ కు చెందిన ఒక చిన్న ఫ్యామిలీ ఒక సాదాసీదా స్టోర్ నడుపుతోంది.
By: Tupaki Desk | 3 Jan 2025 6:30 PM GMTలాటరీ తగలటమంటే అలా ఇలా కాదు. జాక్ పాట్ కొడితే ఇలా ఉండాలన్నట్లుగా అనిపించే ఉదంతమిది. లాటరీ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీగా చెబుతున్నారు. ఇంతకూ ప్రైజ్ మనీ ఎంతంటారా? అక్షరాల రూ.10 వేల కోట్లు. అమెరికాలోని ఒక చిన్న కుటుంబానికి ఈ భారీ జాక్ పాట్ తగిలినట్లుగా చెబుతున్నారు. అయితే.. వారెవరు? వారి నేపథ్యం ఏమిటి? లాంటి వివరాల్ని మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు.
కాలిఫోర్నియాలోని కాటన్ వుడ్ కు చెందిన ఒక చిన్న ఫ్యామిలీ ఒక సాదాసీదా స్టోర్ నడుపుతోంది. ఈ ఫ్యామిలీ ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ అమ్మి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ హిస్టరీలోనూ అతి పెద్ద జాక్ పాట్ గా చెబుతున్నారు. అనూహ్యంగా ఈ స్టోర్ లో అమ్మిన లాటరీ టికెట్ కే జాక్ పాట్ తగిలింది.
దీంతో ఈ స్టోర్ కు ఒక మిలియన్ డాలర్ల రిటైల్ బోనస్ అందుతుందని చెబుతున్నారు. జాక్ పాట్ తగిలిన వారి వివరాల్ని గుట్టుగా ఉంచారు.కానీ.. లాటరీ అమ్మిన స్టోర్ విషయంలోకి వెళితే..కాటన్ వుడ్ సిటీలోని రోండా రోడ్ లోని సర్కిల్ కే స్టోర్ లో ఈ టికెట్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిని భారత సంతతికి చెందిన జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు. జాక్ పాట్ తగిలిన వారే కాదు.. ఆ టికెట్ అమ్మిన దుకాణదారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యేలా రిటైలర్ బోనస్ ఉండటం అందరిని మాట్లాడుకునేలా చేస్తోంది.