Begin typing your search above and press return to search.

అమెరికాలో కోఠి లాంటి షాపింగ్ ఏరియా?

అవును అచ్చంగా కోఠీనే త‌ల‌పిస్తుంది ఆప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ల‌గానే కోఠి వెళ్లిన ఫీలింగ్ మ‌న భార‌తీ యులంద‌రికీ వ‌స్తుంది.

By:  Tupaki Desk   |   11 July 2024 7:05 AM GMT
అమెరికాలో కోఠి లాంటి షాపింగ్ ఏరియా?
X

అగ్ర‌దేశం అమెరికా అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది ఎత్తైన బిల్డింగ్ లు..బంగ‌ళాలు.. అంద‌మైన లొకేష‌న్లు... మంచి రోడ్లు..హైటెక్ లైఫ్ స్టైల్..ఎక్క‌డా చూసినా క్లీన్ అండ్ గ్రీన్. అద్దాల మేడ‌ల్లో షాపులు ఇలా కొంత ఐడియా వ‌స్తుంది? కానీ అక్క‌డ కూడా మ‌న హైదరాబాద్ లాంటి కోఠీ లాంటి ఏరియా ఉంద‌ని ఎంత మందికి తెలుసు? అంటే అక్క‌డికి వెళ్లి చూసిన వారంద‌రికీ తెలుస్తుంది. న్యూయార్క్ న‌గ‌రంలోని జాక్స‌న్ హైట్స్ ప్రాంతంలో ఉండే స్ట్రీట్ షాపింగ్ భార‌తీయుల‌కు స్వ‌దేశీ అనుభ‌వాన్ని పంచుతుంది.

అవును అచ్చంగా కోఠీనే త‌ల‌పిస్తుంది ఆప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ల‌గానే కోఠి వెళ్లిన ఫీలింగ్ మ‌న భార‌తీ యులంద‌రికీ వ‌స్తుంది. రోడ్డు ఇరుపక్క‌ల తోపుడు బండ్ల‌పై షాపుల్..బ‌ట్ట‌ల కొట్లు..తిను బండారాలు.. పూల బొక్కేలు ఇలా అన్ని అక్క‌డ దొరుకుతాయి. దొర‌క‌ని వ‌స్తువు అంటూ ఏదీ ఉండ‌దు. ఎంచ‌క్కా న‌చ్చిన వ‌స్తువుల‌న్నీ అక్క‌డ కొనొచ్చు. న‌చ్చిన స్ట్రీట్ పుడ్ తినొచ్చు. అక్క‌డ వ్యాపారం చేస్తుంది అంతా చిన్న స్థాయి జీవిన విధానం క‌ల‌వారే.

ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ షాపులుంటాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో షాపింగ్ చేసేది ఎక్కువ గా భార‌తీయులేన‌ట‌. హైద‌రాబాద్, ముంబై, బెంగుళూరు లాంటి సిటీ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డ్డ‌వారికి అక్క‌డ వెళ్ల‌గానే మ‌న ప్రాంతంలో ఉన్నామ‌నే భావ‌న‌తో ఉంటారుట‌. వారంలో ఏదో ఒకరోజు కుటుం స‌మేతంగా త‌ప్ప‌కుండా వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తారుట‌. అక్క‌డికి వెళ్లేస‌రికి రెగ్యుల‌ర్ లైఫ్ స్టైల్ కి భిన్న‌మైన అనుభూతి క‌లుగుతుంద‌ని అంటున్నారు.

మ‌రి ఆ ప్రాంతంలో తెలుగు సినిమా షూటింగ్ లు జ‌రిగితే మ‌రింత ప్రాచుర్యం త‌ప్ప‌నిస‌రి. ఎలాగూ సినిమా షూటింగ్ ల కోసం త‌రుచూ అమెరికాకి వెళ్తూనే ఉంటారు. వెకేష‌న్ల‌కు వెళ్తుంటారు. సెల‌బ్రిటీల‌కు అక్క‌డ నుంచి కూడా ఫోటోలు పోస్ట్ చేస్తుంటే? భార‌త‌దేశం మొత్తానికి మ‌రింత‌గా తెలిసే అవ‌కాశం ఉంటుంది.