జగన్‌కు సెగ: సమర్ధించేవారు-విమర్శించేవారు!
కీలకమైన బడ్జెట్ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమర్థించేవారు కూడా కరువవడం గమనార్హం.
By: Tupaki Desk | 11 Nov 2024 12:30 PM GMTవైసీపీ అధినేత జగన్‌కు సెగ భారీగా తగులుతోంది. విమర్శించేవారు ఎలానూ విమర్శిస్తారు. కానీ, సమర్థిం చే వారు కూడా.. ఇప్పుడు విమర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ పరిణామం.. పార్టీకి జగన్‌కు కూడా ఇబ్బందిగానే మారనుంది. ఏనోట విన్నా..ఇప్పుడు జగన్ ఆయన ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం అనేటాక్ వినిపిస్తోంది. నిజానికి జగన్ వ్యవహారం.. ఎప్పుడూ ఆసక్తే. ఇప్పుడు సభ జరుగుతున్న సమయం లో ఆయనను హాజరు కాకపోవడం మరింత దుమారం రేపింది.
ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు సభ్యుల సంఖ్యా బలంతో సంబంధం లేకుండా సభకు హాజరుకావాల్సి ఉం టుంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. కానీ, జగన్ స్టయిలే వేరు కాబట్టి.. ఆయన తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. వచ్చేది లదేన్నట్టుగా వ్యవహరించారు. తద్వారా.. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమర్థించేవారు కూడా కరువవడం గమనార్హం.
ఎందుకంటే.. ఎంత సమర్థించాలన్నా.. జగన్ వైపు కనీసంలో కనీసం.. ఒక పద్ధతి ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న తర్వాత, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నది సభ్యుల ప్రధాన కర్తవ్యం. అయి తే.. దీనిని గాలికి వదిలేసిన జగన్.. తన పంతం తన పట్టుదలలకే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అంతెందుకు.. తనకు తిరుగేలేదనుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. పదేళ్ల పాలన తర్వాత ప్రజలు గద్దెదింపేసినా.. ఎలాంటి భిడియం లేకుండా.. సభకు వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. ఇదీ.. ఒక పద్ధతి. కానీ, దీనిని సైతం జగన్ వదిలేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి ఆయన వచ్చి ఉంటే.. ప్రభుత్వం వైపు నుంచి కూడా.. ఎంతో కొంత సహకారం అందించాలనే అంతర్గత సంభాషణల్లో వినిపిం చింది. కానీ, జగన్ మొండి వైఖరే ప్రదర్శించారు. దీంతో ఆయనను సమర్థించే మీడియా కానీ, వ్యక్తులు కానీ.. ఎవరూ ఇప్పుడు నోరు విప్పలేని పరిస్థితి ఏర్పడింది.