Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాలలో వారే జగన్ బలం

వైసీపీ అధినేత జగన్ కి గోదావరి జిల్లాలు టఫ్ జాబ్ గా మారాయి.

By:  Tupaki Desk   |   28 Sep 2024 3:50 AM GMT
గోదావరి జిల్లాలలో వారే జగన్ బలం
X

వైసీపీ అధినేత జగన్ కి గోదావరి జిల్లాలు టఫ్ జాబ్ గా మారాయి. ఈ జిల్లాలలో పార్టీ నుంచి వరసబెట్టి నేతలు బయటకు చెక్కేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు లేక లేని వారు అన్న తేడా ఏమీ లేదు. వైసీపీ జెండా పీకేసి మరీ పోతున్నారు. వారిలో పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న వారూ ఉన్నారు. వైసీపీకి జగన్ కి వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయులు కూడా పార్టీ గేటు దాటడం కలవరం రేపుతోంది.

ఇలాగైతే కొంప కొల్లేరే అన్న మాటా వినిపించి కేడర్ ని కలవరపెడుతోంది. ఇంకో వైపు చూస్తే ఉన్న నేతల మీద కూడా పుకారులు షికార్లు చేస్తూ వచ్చాయి. వారంతా సైలెంట్ గా ఉండడంతో పాటు వారూ పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంతో అసలు ఏమి జరుగుతోంది అన్నది కూడా అర్ధం కూడా కావడం లేదు అంటున్నారు.

ఇక బలమైన సామాజికవర్గం ఈ జిల్లాలలో జనసేనను ఆదరిస్తోంది. ఆ విధంగా క్యాస్ట్ పోలరైజేషన్ కూడా జరుగుతోంది. జనసేన జెండా పట్టుకోని వారిని రాజకీయంగా దూరం పెట్టే పరిస్థితి కూడా వస్తోంది. దీంతోనే చాలా మంది ఫ్యాన్ నీడను వదిలేసి ముందుకు పోతున్నారు అని విశ్లేషిస్తున్నారు

ఈ క్రమంలో గోదావరి జిల్లాలో వైసీపీకి జిల్లా బాధ్యులు ఎవరు అని ఒకటికి పది మార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. అయితే ఎట్టకేలకు జగన్ గోదావరి జిల్లాలో వైసీపీని చక్కదిద్దే చర్యలకు దిగారు. ఈ క్రనంలో ఆయన కాకినాడ జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుని నియమించారు. ఆయన దూకుడు గలిగిన రాజకీయ నేత కావడంతో పాటు బలమైన సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు.

అదే విధంగా చూస్తే గతంలో కూడా కన్నబాబు వైసీపీ విపక్షంలో ఉన్నపుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో ఆయనకే తిరిగి బాధ్యతలను జగన్ అప్పగించారు అని అంటున్నారు. అలాగే కోనసీమ జిల్లాకు మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కి బాధ్యతలు అప్పగించారు. అక్కడ సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మరీ విశ్వరూప్ కి పెద్ద పీట వేశారు అని అంటున్నారు.

అయితే ఇంకా ఏలూరు జిల్లా ఉంది. ఇక్కడ దాదాపుగా పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది అని అంటున్నారు. దాంతో ఈ జిల్లాకు ఎవరిని ప్రెసిడెంట్ గా చేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షునిగా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి కూడా రాజీనమా చేసేసారు. ఇదే జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూడా పార్టీని వీడారు.

ఇలా అనేక మంది ఏలూరు జిల్లాలో తప్పుకున్నారు. ఇక ఏలూరు ఎంపీగా 2019లో గెలిచిన కోటగిరి శ్రీధర్ కూడా ఎన్నికల ముందే సీటు వద్దని తప్పుకున్నారు. దాంతో ఈ జిల్లా పగ్గాలు ఎవరికి ఇస్తారు అని చర్చించుకుంటున్నారు. గోదావరి జిల్లాలో వైసీపీ పుంజుకుంటేనే తప్ప అధికారం మీద ఆశలు ఉండవని అంటున్నారు. మరి జగన్ ఏ మ్యాజిక్ చేసి నేతలను సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.