Begin typing your search above and press return to search.

జగన్ ని పూర్తిగా కట్టడి చేసినట్లేనా ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరలో నాలుగు నెలలు పూర్తి అవుతాయి.

By:  Tupaki Desk   |   28 Sep 2024 4:12 AM GMT
జగన్ ని పూర్తిగా కట్టడి చేసినట్లేనా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరలో నాలుగు నెలలు పూర్తి అవుతాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా జగన్ ఈ మధ్యకాలంలో చాలా జిల్లాలు తిరిగారు. మొదట్లో ఆయన తన పార్టీ క్యాడర్ కి ధైర్యం చెప్పడానికి టూర్లు చేశారు. ఆ తరువాత విశాఖ అచ్యుతాపురంలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.

ఇక వరదలు వచ్చి ఏపీలో బెజవాడ గోదావరి జిల్లాలు అన్నీ కూడా ఇబ్బందులు పడితే ఆయా చోట్ల జగన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో జగన్ ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. జగన్ సైతం మీడియా ముందు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేశారు.

ఆయన కూటమిని వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నిలదీస్తూ వస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. దాంతో బాబు వ్యూహం అనుకోవాలో లేక యధాలాపంగా వచ్చిన లడ్డూ ప్రసాదం ఇష్యూవో తెలియదు కానీ ఇపుడు అదే ఆయుధంగా చేసి జగన్ మీద ప్రయోగించారు.అని అంటున్నారు.

దాంతో ఒక ప్రధాన వర్గానికి జగన్ ని దూరం చేసే ఎత్తుగడ ఇదని వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ వైసీపీ దీని నుంచి బయటపడలేకపోతోంది. తిరుమలకు వెళ్ళి జగన్ దీని విషయంలో వైసీపీని తనను ఒడ్డున పడవేసుకునే కార్యక్రమం చేయాలనుకుంటే దానికి కూడా విరుగుడు మంత్రం కూటమి కనిపెట్టింది.

ఫలితంగా జగన్ తిరుమలకు వెళ్ళలేకపోయారు. ఆయన తాడేపల్లిలోనే తన ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది ఒక విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం విజయమే అని చెప్పాలి. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరికలు ఆందోళన నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు.

ఇక జగన్ విషయంలో కట్టడి చేయడం ద్వారా కూటమి పై చేయి సాధించింది అని భావించాలి. సరే ఈ ఇష్యూ కనుక ఇంకా కొనసాగినా లేకపోయినా జగన్ ఏ జిల్లాకు అయినా పర్యటనకు వెళ్తే వైసీపీ లీడర్లను హౌజ్ అరెస్ట్ చేసి జగన్ ని ఒంటరి చేసి ఆందోళనలకు పిలుపు ఇస్తే ఆయన రాకుండానే ఉండిపోవాల్సి వస్తుంది.

విషయం తెలిసింది కాబట్టి ఇదే తీరున కూటమి పెద్దలు ఆలోచించవచ్చు. జగన్ తిరుమల పర్యటన విషయంలో జరిగినట్లుగానే ఇక మీదట జిల్లా పర్యటనలలో జరుగుతాయా అంటే జరగవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆందోళనలు చెలరేగుతాయి ఉద్రిక్తలు తలెత్తుతాయి అని ప్రభుత్వం చెప్పి పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుంది.

అలా జగన్ ని తాడేపల్లికే పరిమితం చేయాలన్నది కూటమి పెద్దల ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదు. ఇది రాజకీయం ప్రత్యర్థిని అలాగే నిలువరించాలని చూస్తారు. మరి వైసీపీ అధినాయకత్వం అయితే చేతులెత్తేసి ప్రెస్ మీట్లు పెట్టి ఉన్న చోటనే ఉండిపోయినంతకాలం ఇదే తీరు సాగుతుంది అని అంటున్నారు. సో వైసీపీ కట్టడి చేయబడుతుందా లేక కట్టలు తెంచుకుని ముందుకు వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.