Begin typing your search above and press return to search.

బాబుని కొత్తగా ఎటాక్ చేసిన జగన్

ఇంతకాలం డిఫెన్స్ మోడ్ లోనే ఉండిపోయిన జగన్ ఇపుడు అఫెన్స్ మోడ్ లోకి వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 3:36 AM GMT
బాబుని కొత్తగా ఎటాక్ చేసిన జగన్
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వైసీపీ అధినేత జగన్ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకాలం డిఫెన్స్ మోడ్ లోనే ఉండిపోయిన జగన్ ఇపుడు అఫెన్స్ మోడ్ లోకి వెళ్తున్నారు. తన కుటుంబం మీద నిరాధార ఆరోపణలు టీడీపీ వారు చేస్తున్నారు అని వాపోయిన జగన్ లో ఇపుడు ఇది కీలక మార్పుగా చెబుతున్నారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు రాజకీయాల్లో జరిగే తంతు.

అయితే జగన్ మాత్రం దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. తమ గురించి జనాలకు ఏంటో తెలుసు. అలాగే చంద్రబాబు గురించి కూడా తెలుసు అని భావిస్తూ ఉండేవారు. అయితే ఇపుడు బాబు గురించి జనాలకు ఏమి తెలుసో ఏమో కానీ తాను అనుకున్నవి మాత్రం గట్టిగా అంటూ ఎటాక్ చేస్తున్నారు.

తన కుటుంబం మీద తన మీద టీడీపీ ఇటీవల కాలంలో గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జగన్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో దానికి ధీటుగా బదులిచ్చారు. తన తల్లి మీద చెల్లెలు మీద ఐటీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఆయన ఎదురు దాడి చేశారు. అంతే కాదు ఫేక్ ఐడీలను సృష్టించి వైసీపీ వారు అలా చేసినట్లుగా క్రియేట్ చేశారని కూడా ఆరోపించారు

ఇక తన కుటుంబం మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారు అంటూ జగన్ ఘాటైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయంగా ఎదిగిన తరువాత ఎపుడైనా తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టి సంతోషపెట్టారా అని ప్రశ్నించారు.

అంతే కాదు తన తల్లిదండ్రులు వీరూ అని ప్రపంచానికి చంద్రబాబు ఎపుడైనా చూపించారాని అని జగన్ నిలదీశారు. తన తల్లిదండ్రులు చనిపోయినపుడైనా చంద్రబాబు తలకొరివి పెట్టారా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వారు అరుదుగా పుడతారని ఏపీ ప్రజల కర్మ కొద్దీ ఆయన ఇక్కడ పుట్టారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు లాంటి వారితో తాము యుద్ధమే చేస్తున్నామని జగన్ అన్నారు.

బాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలల తరువాత ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన బడ్జెట్ ని ఆయనే అసెంబ్లీలో ఒప్పుకోలేకపోతున్నారు అని అన్నారు. అందులోని అంకెలను ఆయనే కాదని అంటున్నారని జగన్ విమర్శించారు.

బడ్జెట్ లో ఆరు లక్షల 45 వేల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పిన బాబు మళ్లీ కాదు పది లక్షల కోట్లు అప్పు అని అంటున్నారని మరి బడ్జెట్ ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించాబు. బాబు కానీ ఆయన మంత్రులు కానీ సూపర్ సిక్స్ హమీలను తప్పించుకోవడానికే ఈ విధంగా చేస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అబద్ధాలు మీద అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. బాబు మీద జగన్ ఈ విధంగా హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనిని కూటమి నేతల నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.