రాష్ట్రంలో మాఫీయా సామ్రాజ్యం... విరుచుకుపడిన జగన్!
సూపర్ సిక్స్ లు కనిపించడం లేదని.. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించడం లేదని.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడం మాత్రమే కనిపిస్తోందని జగన్ విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 28 Nov 2024 1:22 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే హస్తిన వేధికగా జగన్ దేశానికి వినిపించేలా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు రోజు రోజుకీ మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయంటూ తాజాగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రాష్ట్రంలో స్కాంల పాలన నడుస్తోందని.. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయని.. రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడ్డారు.
తన పాదయాత్రలో కష్టాలను చూసి.. అందుకు తగ్గట్టుగా గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని.. ప్రతీ ఇంటికీ మంచి చేశామని జగన్ తెలిపారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయని.. అది ఎలా జరుగుతుందో చూస్తున్నే ఉన్నామని జగన్ పేర్కొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని అన్నారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయని చెప్పిన జగన్.. ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా లిక్కర్, ఇసుక స్కాంలతో పాటు పేకాట క్లబ్ లు కనిపిస్తున్నాయని.. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ తో భరోసా ఇవ్వలేకపోగా.. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ ఫైరయ్యారు.
ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా సాకులు చెబుతున్నారని.. సూపర్ సిక్స్ లు కనిపించడం లేదని.. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించడం లేదని.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడం మాత్రమే కనిపిస్తోందని జగన్ విరుచుకుపడ్డారు.
తమ పాలనలో ప్రజలకు మంచి చేయాలనే అడుగులు ముందుకు పడ్డాయని.. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగామని.. ప్రతీ గ్రామంలోను సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని.. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చామని జగన్ తెలిపారు.
ఇదే సమయంలో... బడ్జెట్ లో క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశామని చెప్పిన జగన్... ఇదంతా వైసీపీ ప్రభుత్వ పాలనలో మాత్రమే జరిగిందని గుర్తు చేశారు! కూటమి పాలనలో మాత్రం బెల్ట్ షాపులు, పేకాట క్లబ్బు మాత్రం కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు.