ఓటమికి కారణం చెబుతున్న జగన్!
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే.. ఆ పార్టీ నేతలే ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వెళ్లబుచ్చిన పరిస్థితి.
By: Tupaki Desk | 12 Feb 2025 12:30 PM GMTగత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే.. ఆ పార్టీ నేతలే ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వెళ్లబుచ్చిన పరిస్థితి. ఇందులో భాగంగా... కొంతమంది ఈవీఎంల వల్ల అని అంటే.. మరికొంతమంది లిక్కర్ పాలసీ వల్ల అని అన్నారు. అయితే... వాస్తవం ఏమిటనేది అందరికీ తెలుసనేది కూటమి మాట.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎందుకు ఓటమిపాలైంది వెల్లడించారు. ఇదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు. బాబు ష్యూరీటీ ఇప్పుడు మోసం అయ్యిందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా స్పందించిన జగన్... ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని.. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం.. అబద్ధం, మోసం అని అన్నారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయిని.. కూటమి కంటే మనకు 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని తెలిపారు.
అందుకు గల కారణం... వారిలా అబద్ధాలు చెప్పలేకోవడనే జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని.. ఆయన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని.. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని జగన్ తెలిపారు. అయితే మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని జగన్ నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో... రాజకీయాల్లో విలువలు, విశ్వసనీత ఉండాలని చెప్పిన జగన్.. మీ జగన్ మరో 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. మనం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని.. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... రాబోయేది జగన్ 2.0 పాలన అని చెప్పిన జగన్.. అన్యాయాలు ఎవరు చేసిననా వదిలిపెట్టమని.. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని.. మన పాలనలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందని.. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని.. జగన్ తెలిపారు.