జగన్ అతి విశ్వాసం.. జనం ఆత్మ విశ్వాసం.. !
`సూపర్ సిక్స్` అమలులో కూటమి సర్కారు ప్రయత్నాలు చేయడం లేదని, నిధులు లేవని చెబుతోందని జగన్ అంటున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 2:30 PM GMTవైసీపీ అధినేత జగన్ మరోసారి అతి విశ్వాసం ప్రదర్శించారు. ఆయన తీరు ఏమాత్రం మారలేదన్న సంకే తాలు ఇచ్చారు. ఘోర ఓటమి తర్వాత మార్పు అనేది సహజంగానే ఏ పార్టీలో అయినా రావాలి. కానీ, జగన్‌లో ఆ మార్పు రావడం లేదు. పైగా ఆయనలో అతి విశ్వాసం పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్ని కలు జరిగినా తమదే గెలుపు అని.. మరో 30 ఏళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెబుతు న్నారు. అయితే.. దీనివెనుక ఉన్నదంతా సంక్షేమ పథకాలపై ఆశలేనని చెప్పాలి.
`సూపర్ సిక్స్` అమలులో కూటమి సర్కారు ప్రయత్నాలు చేయడం లేదని, నిధులు లేవని చెబుతోందని జగన్ అంటున్నారు. తాము 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నప్పటికీ.. నవరత్నాలు అమ లు చేశామని.. కానీ, తాను దిగిపోతూ.. 4 వేల కోట్ల కు పైగా ఖజానాలో ఉంచినా కూటమి సర్కారు అమలు చేయడం లేదేన్నది జగన్ వాదన. అందుకే.. ప్రజలు తనవైపు చూస్తున్నారన్నది కూడా ఆయన భావన కావొచ్చు. దీనిపై జగన్ ద్రుఢ నిశ్చయంతో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
కానీ, వాస్తవానికి ప్రజల ఆలోచన వేరేగా ఉంది. ఉచితాలు కోరుకునే ప్రజలు ఎంత మంది ఉన్నారో.. గత ఎన్నికల్లో అర్థమైంది. మొత్తం జనాభాలో 40 శాతం మంది ఉచితాలు కోరుకుంటున్నారు. ఇదే ఓటు బ్యాంకు వైసీపీకి పడిందని అనుకున్నా.. డెవలప్‌మెంట్ కోరుకునే వారే ఎక్కువగా ఉన్న విషయం కూడా స్ఫష్టమైంది. సుమారు 60 శాతం మందికిపైగానే.. రాష్ట్రంలో ఉపాధి కల్పన,ఉద్యోగాలు, డెవలప్‌మెంట్.. ముఖ్యంగా రాజధాని వంటివాటిని కోరుకుంటున్నారు.
అందుకే.. జగన్ చిత్తుగా ఓడిపోయారు. అంటే.. జగన్ అతి విశ్వాసానికి పోతుంటే.. జనాలు మాత్రం రాష్ట్రం వృద్ధి చెందుతున్న ఆత్మ విశ్వాసంతోనే ఉన్నారు. కాబట్టి.. ఉచితాలు కోరుకునే 40 శాతం మందిని పక్కన పెడితే.. మిగిలిన 60 శాతం మంది మాత్రం కూటమి సర్కారువైపే ఉన్నారు. పైగా.. రహదారులు బాగు పడుతున్నాయి. ఇతర మౌలిక సదుపాయాలు కూడా అందివస్తున్నాయి. పెట్టుబడుల కల్పన ద్వారా ఉపాధి, ఉద్యోగాలపై ఆశలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కూటమిపై వ్యతిరేకత పెరిగిపోయిందన్న జగన్ వాదన ఫలించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.