Begin typing your search above and press return to search.

షర్మిల మీద జగన్ పరువు నష్టం దావా ?

దాంతో జగన్ మీడియా సమావేశం పెట్టి అసలు ఒప్పందాలు ఎలా కుదిరాయి అన్నది పూసగుచ్చినట్లుగా తనదైన వెర్షన్ వినిపించారు.

By:  Tupaki Desk   |   29 Nov 2024 5:14 PM GMT
షర్మిల మీద జగన్ పరువు నష్టం దావా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తన మీద నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అదే పనిగా తప్పుడు వార్తలను వండి వారుస్తోందని ప్రెస్ మీట్ లో ఆగ్రహించారు. రెండు రోజులలో వారు తనకు క్షమాపణలు చెప్పకపోతే మాత్రం వారి మీద పరువు నష్టం దావా ఏకంగా వంద కోట్లకు వేస్తాను అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు

అదానీ సంస్థల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జగన్ 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అన్న తీవ్రమైన ఆరోపణలు గత కొన్ని రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది రేపో మాపో జైలుకు అని కూడా అంటోంది.

దాంతో జగన్ మీడియా సమావేశం పెట్టి అసలు ఒప్పందాలు ఎలా కుదిరాయి అన్నది పూసగుచ్చినట్లుగా తనదైన వెర్షన్ వినిపించారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని ఏపీకి వేల కోట్లలో సంపదను ఈ విధంగా క్రియేట్ చేశాను అని చెప్పారు. తాను మంచి పని చేస్తే మెచ్చాల్సింది పోయి ఇపుడు ఈ స్థాయిలో విమర్శలా అని ఆయన మండిపడ్డారు.

తన పేరు ఎక్కడా అమెరికా లోని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన చార్జిషీటులో లేదు అని ఆయన అన్నారు అయినా తన మీద అదే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అందువల్ల మీడియా మీద పరువు నష్టం దావా వేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు రెండు బిగ్ మీడియా హౌజ్ మేనేజ్మెంట్ మీద ఈ పరువు నష్టం దావా ఉంటుందని అన్నారు.

ఇదంతా సరే అనుకున్నా జగన్ మీద అదే పనిగా ఇవే ఆరోపణలు చేస్తున్న ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల లేటెస్ట్ గా మరింత తీవ్రంగా ట్వీట్ చేస్తూ జగన్ ముడుపులు తీసుకున్నారు అన్నట్లుగానే మాట్లడారు ఆమె జగన్ విషయంలో ఆయన అవినీతి చేశారు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు.

మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద పరువు నష్టం అని గర్జించిన జగన్ తన సొంత చెల్లెలు విషయంలో ఏమి చేస్తారు అన్న చర్చకు తెర లేచింది. దీని మీద రాజకీయ విశ్లేషకులు అయితే జగన్ ఈ విషయంలో గట్టిగా ఉంటే కనుక మొదట పరువు నష్టం దావా వేయాల్సింది సొంత చెల్లెలు మీదనే అంటున్నారు.

తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అని కదా జగన్ దావా వేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. మరి మీడియా మీద వేసే ముందు అదే పనిగా జగన్ మీద ఆరోపణలు చేస్తున్న షర్మిల మీద వేసి అక్కడ నుంచే పరువు నష్టం దావా ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని అంటున్నారు.

మరి జగన్ ఈ పని చేస్తారా అన్నదే చర్చగా ఉంది. జగన్ అయితే ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీ ఉందని గుర్తించడం లేదు అని అంటున్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్కరూ షర్మిల చేసే ఏ కామెంట్ మీద ఇటీవల కాలంలో స్పందించడం లేదని కూడా గుర్తు చేస్తున్నారు

తాము ఏ చిన్న కామెంట్స్ చేసినా దానిని పట్టుకుని ఆమె మరింత రచ్చ చేస్తారని దాంతో ఆమెకు మరింతగా ప్రాచుర్యం కల్పించడమే అవుతుంది అన్న పద్ధతిలో వైసీపీ ఉంది. తాము కనుక ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే అవి రాజకీయంగా వైసీపీకే ఇబ్బందిగా మారి ఆమెకు ప్లస్ అవుతుంది అని కూడా ఆలోచించి మరీ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కనుక చూస్తే షర్మిల మీద జగన్ ఏ విధంగా దావా వేసేది ఉండదని అంటున్నారు. ఎందుకు అంటే ఒకవేళ వేస్తే కనుక సొంత చెల్లెలు మీద కోర్టుకు వెళ్లారని కూడా ప్రత్యర్ధులు దానిని మరింతగా కెలికి వదిలిపెడతారు అది కాస్తా బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. అందువల్ల షర్మిల ఎంతలా రెచ్చగొట్టినా ఎంత ఘాటు విమర్శలు చేసినా వైసీపీ నుంచి అయితే ఏ విధమైన రియాక్షన్ ఉండదనే అంటున్నారు. మరి షర్మిల ఊరుకుంటారా లేక ఇంతకంటే ఘాటుగా మాట్లాడి ఏదో స్థాయిలో వైసీపీ రియాక్ట్ అయ్యేలా చూసి అక్కడ పొలిటికల్ గా తాను సక్సెస్ అవుతారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.