చెప్పినట్లే చేసిన జగన్...కొత్త పోరాటానికి సై !
జగన్ రాజకీయ జీవితంలో డిఫెన్స్ మోడ్ లో ఫైట్ చేయడం తప్ప అఫెన్సివ్ మోడ్ లో ఎటాక్ చేయడం చాలా తక్కువ.
By: Tupaki Desk | 1 Dec 2024 3:58 AM GMTజగన్ రాజకీయ జీవితంలో డిఫెన్స్ మోడ్ లో ఫైట్ చేయడం తప్ప అఫెన్సివ్ మోడ్ లో ఎటాక్ చేయడం చాలా తక్కువ. ఆయన ఎపుడూ పైన ఉన్న దేవుడు కింద ఉన్న జనాలూ అన్నీ చూస్తారు అని అంటూంటారు. తాను దేనిలోనూ కలుగచేసుకోనక్కరలేదన్న భావనతో ఉంటారు.
జనాలకు ఎవరేమిటి అన్నది కూడా తెలుసు అని జగన్ భావిస్తారు. ఇదిలా ఉంటే జగన్ లో 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత వచ్చిన సరికొత్త మార్పు ఏంటి అంటే పొలిటికల్ గేమ్ ని ఎఫెన్సివ్ మోడ్ లో ఆడడం. అంటే ఎంతసేపూ ఎదుటి వారు తమ మీద నిందలు వేస్తే దానిని కాచుకోవడమే కాకుండా తాము కూడా కత్తులు తీసి యుద్ధానికి సిద్ధం కావడం.
నిజంగా రాజకీయాల్లో చేయాల్సిన పని ఇదే. కానీ జగన్ మాత్రం దానిని మరచారు అని వైసీపీలో అంటూంటారు. అందుకే జగన్ మీద ఈ రోజు కాదు మొదట్లోనే లక్ష కోట్లు తిన్నారూ అని ఆరోపణలు చేసినా లేక ఆయన కుటుంబం మీద వ్యక్తిగతంగా ఆయన మీద అనేక నిందలు వేసినా ఆయన పట్టించుకోకుండా ఉండిపోయారని చెబుతారు.
కానీ తన పొలిటికల్ కెరీర్ లో ఫస్ట్ టైం ఆయన కేవలం మాటలతో విడిచిపెట్టకుండా చేతలకు దిగారు. ఆ రెండు పత్రికలు ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే జగన్ ఇక లీగల్ బాటిల్ ని ఎంచుకున్నారు. అదానీ నుంచి తాను పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించాను అని వచ్చిన వార్తల పట్ల జగన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
వరసబెట్టి రోజుల తరబడి దీని మీద బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరీ తన పరువుకు భంగం కలిగించారని అంటూ జగన్ రెండు తెలుగు దినపత్రికకలు లీగల్ నోటీసులు జారీ చేశారు. జగన్ దీని కంటే ముందు మీడియా సమావేశం పెట్టి ఆ రెండు పత్రికలు తనకు క్షమాపణ రెండు రోజులలోగా చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
దానికి ఆ పత్రికలు స్పందించకపోవడంతో ఆయన లీగల్ నోటీసులను పంపించారు. ఇక తన హయాంలో పారదర్శకంగా జరిగిన విద్యుత్ ఒప్పంద పత్రాలను సైతం ఆ నోటీసులకు జత చేశారు. ఆనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద తప్పుడు కధనాలు రాసారని జగన్ ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచురించిన ఆ కధనాలు తన పరువుకు నష్టం కలిగించాయని ఆయన అన్నారు. అందువల్ల భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆయన కోరారు.
అంతే కాదు క్షమాపణలు చెప్పినట్లుగా ఆయా పత్రికలలో మొదటి పేజీలో ప్రచురించాలని కూడా ఆయన కోరారు. జగన్ వేసిన ఆ పరువు నష్టం దావా అయితే ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. జగన్ అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారికి కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. పరువు అన్నది అందరికీ ఉంటుందని తమ అధినేత ఎపుడూ చూసీ చూడనట్లుగా వదిలేయడం వల్లనే ఇంతదాకా వస్తోందని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ నేతల మీద ప్రత్యర్ధులు పరువు నష్టం వేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ వైసీపీ పొలిటికల్ హిస్టరీలో తొలిసారి ఇలా చేయడం అది కూడా అధినేత జగన్ నుండే ప్రారంభం కావడంతో ఇక మీదట రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కానీ అలాగే మీడియాలో వచ్చే వార్తల విషయంలో కానీ ఎవరైనా కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
రాజకీయ పార్టీలలో అందరూ కూడా విమర్శలు చేసుకోవచ్చు. కానీ అవి పరువు తీసేలా ఉండరాదని అంటున్నారు. ఏపీలోనే కాదు తెలుగు నాట రెండు రాష్ట్రాలలో ఈ పరువు నష్టం కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. అందులో మీడియా కూడా భాగం కావడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. లోకేష్ కూడా తన మీద తప్పుడు రాతలు రాశరని ఒక మీడియా యాజమాన్యం మీద పరువు నష్టం కేసు వేసిన సంగతి విధితమే.