Begin typing your search above and press return to search.

జగన్ ది డైరెక్ట్ ఎటాక్..బాబుది ఇండైరెక్ట్ ఎటాక్...తేడా ఇదే !

ఏది ఏమైనా రాజకీయాల్లో జగన్ చేస్తున్నది కరెక్టా అంటే పొలిటికల్ గా అది అంత కరెక్ట్ కాదేమో అని అంటారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:13 PM GMT
జగన్ ది డైరెక్ట్ ఎటాక్..బాబుది ఇండైరెక్ట్ ఎటాక్...తేడా ఇదే !
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఢక్కా మెక్కీలు తిన్న నాయకుడు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగి వచ్చిన నేత. ఆయన తన అర్ధ శతాబ్దం జీవితంలో రాజకీయాలను ఔపాసన పట్టేశారు. ఆయనకు రాజకీయం ఎలా చేయాలో బాగా తెలుసు అని అంటారు.

ఇక వైఎస్ జగన్ డైరెక్ట్ గా ఎంపీ అయిపోయారు. ఆయన ఇంట్లోనే రాజకీయం ఉన్నా జగన్ కి ఎంత వరకూ ఒంటబట్టింది అంటే జవాబు అందరికీ తెలిసిందే. ఇక జగన్ రాజకీయ వ్యూహాలు అందరికీ తెలిసిపోతాయి. ఆయన చెప్పి చేయడం అలవాటు గా చేసుకున్నారు. అలా విశ్లేషించుకుంటే కనుక జగన్ ది డైరెక్ట్ రాజకీయం అయితే చంద్రబాబుది ఇండైరెక్ట్ రాజకీయంగా అంటారు. ఇక జగన్ ఏమి చేసినా డైరెక్ట్ గానే చేస్తారు అంటారు. ఆయన ఎటాక్ డైరెక్ట్ గానే ఉంటుంది అని చెప్పాల్సిందే.

ఆయన మాటలు తక్కువగా చెప్పినా చేతలలో ఆ డైరెక్ట్ గా చేసే విధానం కనిపిస్తుంది. ఉదాహరణకు చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేసిన తీరుని అని చెబుతారు. అలాగే వైసీపీలో రెబెల్ ఎంపీగా ఉంటూ బాగా విసిగించిన రఘురామ క్రిష్ణం రాజు విషయంలోనూ అదే తీరుగా దూకుడు చేశారు అంటారు. ఇక ఆయన మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించారు అని కూడా అంటారు.

ఇవే కాదు ప్రజలకు నేరుగా నగదు బదిలీ పేరుతో డబ్బులు పంచడంలో అయినా జగన్ ది డైరెక్ట్ ఎటాక్ నే అని అంటారు. ఇక అప్పులు చేసిన లేక అవినీతి వైసీపీ హయాంలో జరిగినా అన్నీ జనాలకు తెలిసేలాగానే జరుగుతూ పోయాయి.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే అంతా ఇండైరెక్ట్ గానే చేస్తారు అని అంటారు. ఆయన ఏ విషయం మీద ఏమి చేయాలన్నా ముందుగా తనకు అనుకూలంగా ఉన్న పత్రికలు మీడియా ద్వారా జనాల మైండ్ సెట్ ని సెట్ చేసే ప్రయత్నం చేస్తారు అని అంటారు. అలా తాను తీసుకోబోయే నిర్ణయాలలో ప్రజలను ప్రిపేర్ చేస్తారు అని అంటారు.

అలా అంతా చేశాక అపుడు ఎటాక్ మొదలెడతారు అని అంటారు. ఇలా చూసుకుంటే చంద్రబాబు ఏదీ డైరెక్ట్ గా చేయరని, అన్నీ తన అనుకూల టీవీల ద్వారా పత్రికల ద్వారా జనాలకు చెప్పించి ఆ మీదట చేస్తూంటారు అని అంటూంటారు.

ఇలా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎన్నో లెక్కలు వ్యూహాలు అన్నీ వేసుకుంటూ జనాల మూడ్ ఆ విధంగా ఉండేలా జాగ్రత్త పడుతూ అపుడు అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయినా పెట్టి మరీ తాను అనుకున్నది కార్యాచరణగా చేస్తారు అని అంటారు.

అయితే ఇదంతా చంద్రబాబు నేర్చిన రాజకీయ అనుభవం నుంచి వచ్చింది. జగన్ విషయం అయితే తాను అనుకున్నది చేస్తారు అని అంటారు. దాని వల్ల వచ్చే పర్యవసానాలు ఫలితాలను ఆయన అసలు ఊహించరని అంటారు. ఏది వచ్చినా రెడీ ఎదుర్కొందామన్న విధానం ఆయంది. అందుకే జగన్ ఆది నిష్టూరం మాదిరిగా ఎక్కువగా విమర్శల పాలు అవుతూంటారు అని విశ్లేషిస్తారు.

ఎప్పటికి అయినా నిజం నిలకడ మీద తెలుస్తుంది అని జగన్ అనుకుంటారు. కానీ ఈలోగా పుణ్యకాలం గడచిపోతుంది అని అంటారు ఆయనను అభిమానించేవారు. నిజానికి రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. ఏదీ కుండబద్ధలు కొట్టేలా ఉండకూడదు ముక్కుసూటితనం రాజకీయాల్లో అసలు పనికిరాదు. అలా చేస్తే కనుక భారీ మూల్యాలే చెల్లించాల్సి ఉంటుంది జగన్ అయితే ఇలాంటివి ఏవీ పట్టించుకోరు కాబట్టి ఎంతటి ఇబ్బందులు అయినా సిద్ధమని అన్నట్లుగా ఉంటారు.

కానీ ఆయన పార్టీ జనాలు అలా ఉండరు కదా. అందుకే వైసీపీ ఒడుదుడుకులు ఎదుర్కోంటోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో జగన్ చేస్తున్నది కరెక్టా అంటే పొలిటికల్ గా అది అంత కరెక్ట్ కాదేమో అని అంటారు. కానీ వైసీపీ అధినాయకుడు అలాగే ఉంటారు అని అంటారు ఆ పార్టీ వారు. సో మరి పొలిటికల్ గా వైసీపీకి వైభోగాలు పరాజయాలూ రెండూ కూడా తప్పవనీ అంటూంటారు.