Begin typing your search above and press return to search.

కండువా మర్చిపోయారా.. మారుస్తున్నారా ఎమ్మెల్యే?... జగన్ సీరియస్!

ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీకి వచ్చిన ఓ వైసీపీ ఎమ్మెల్యే విషయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది!

By:  Tupaki Desk   |   24 Feb 2025 10:39 AM GMT
కండువా మర్చిపోయారా..  మారుస్తున్నారా ఎమ్మెల్యే?... జగన్  సీరియస్!
X

రాజకీయ నాయకులకు మెడలో తానున్న పార్టీకి సంబంధించిన కండువా ధరించడం చాలా ముఖ్యం అని చెబుతుంటారు. అలా అని ప్రతీ సందర్భంలో ధరించకపోయినా.. ధరించాల్సిన సందర్భంలో మాత్రం కచ్చితంగా ధరించే తీరాలని అంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీకి వచ్చిన ఓ వైసీపీ ఎమ్మెల్యే విషయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది!

అవును... ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన వెంట మిగిలిన 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో.. సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ఊహాగాణ ప్రచారం తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా... వైసీపీ ఎమ్మెల్యేలు అంతా పార్టీ కండువాలు ధరించి కనిపించారు!

అయితే... ఒక ఎమ్మెల్యే.. తాటిపాటి రాజశేఖర్ మాత్రమే కండువా ధరించకుండా ఉన్నారనేది ఇక్కడ టాపిక్ గా ఉంది. దీంతో... ఈ విషయంపై జగన్ అసంతృప్తి చెందారని.. అనంతరం, సదరు ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. దీనికి సమాధానంగా స్పందించిన ఎమ్మెల్యే రాజశేఖర్... తాను కండువా మర్చిపోయానని అన్నారని చెబుతున్నారు.

అయితే... ఈ సమాధానంపై మరింత అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్... నిజంగానే కండువా మర్చిపోయారా.. లేక, కండువా మారుస్తున్నారా? అని అడిగారనే ఓ ప్రచారం సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. కాగా.. సదరు ఎమ్మెల్యే అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మెడలో కండువా ధరించి ఉండటం గమనార్హం.