జోగికి మైలవరం ఇచ్చిన జగన్?
మొత్తానికి పెడన నుంచి తన సొంత నియోజకవర్గం మైలవరానికి జోగి వచ్చేశారు. ఈ మేఅకు జగన్ ఆయనకు వరంగా మైలవరం ఇచ్చారని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Nov 2024 10:30 PM GMTఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న వారు బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన జగన్ మీద ఈగ వాలితే సహించలేని వారు. ఆయన నోటి వెంట హార్ష్ గా ఎన్నో పదాలు అలా ప్రత్యర్థి పార్టీల మీద దొర్లుకుంటూ వచ్చేవి. ఆయన అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నపుడే చంద్రబాబు ఇంటి మీదకు కూడా వెళ్లారు అన్న దాని మీద ఇపుడు కేసులు తిరగ తోడుతున్నారు.
ఆయన కుమారుడి మీద కూడా కేసులు పడ్డాయి. దీంతో జోగి రమేష్ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జోగి రమేష్ మైలవరంలో ఒక పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
వైసీపీ క్యాడర్ తో ఆయన నిర్వహించిన సమావేశంలో తాను వైసీపీని వీడను అని అన్నారు. పార్టీలోకి గతంలో వచ్చిన వారు పబ్బం గడుపుకుని వెళ్ళిపోయారు అని మైలవరం వైసీపీ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఆయన పార్టీలోకి వస్తాను అన్నపుడే జగన్ కి చెప్పానని అన్నారు. అయితే జగన్ ఆయనను చేర్చుకున్నారని తీరా ఆయన ఇపుడు నమ్మించి మోసం చేశారని క్రిష్ణ ప్రసాద్ మీద మండిపడ్డారు.
మరో వైపు చూస్తే తన మీద కేసులు ఎన్ని పెట్టుకున్నా తాను భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఇబ్రహీం గడ్డ మీదనే ఉన్నానని జోగి రమేష్ తెలిపారు. తనతో ఉండేవారు కేసులకు భయపడకుండా ఉంటేనే కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. అలా కాదు అనుకున్న వారు వెళ్ళిపోవచ్చు అన్నారు. మైలవరం ఎమ్మెల్యేగా క్రిష్ణ ప్రసాద్ ని గెలిపిస్తే ఇపుడు నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇక తన రాజకీయ కార్యాచరణను జోగి రమేష్ ప్రకటించేశారు. జనవరిలో మైలవరంలో పార్టీ ఆఫీసుని ప్రారంభిస్తామని అన్నారు మళ్లీ జగన్ ని సీఎం గా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఈసారి వైసీపీ తప్పకుండా గెలుస్తుందని జోగి జోస్యం చెబుతున్నారు.
మొత్తానికి పెడన నుంచి తన సొంత నియోజకవర్గం మైలవరానికి జోగి వచ్చేశారు. ఈ మేఅకు జగన్ ఆయనకు వరంగా మైలవరం ఇచ్చారని అంటున్నారు. రానున్న రోజులలో మైలవరంలో జోగి రమేష్ దూకుడు రాజకీయాలు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. అయితే పెడనలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంది.