Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మ‌ళ్లీ రెడ్ల‌కు ప్రాధాన్యం.. ఇదే ఎగ్జాంపులా..!

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో మురుగుడు లావ‌ణ్య ప‌రాజ‌యం పాల‌వ‌డంతో.. జ‌గ‌న్ మ‌ళ్లీ రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వేమారెడ్డిని ఇంచార్జ్‌గా నియ‌మించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 10:30 PM GMT
జ‌గ‌న్ మ‌ళ్లీ రెడ్ల‌కు ప్రాధాన్యం.. ఇదే ఎగ్జాంపులా..!
X

ఏ పార్టీకైనా.. ప్ర‌జ‌లు అవ‌స‌రం. ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం అనేది పార్టీల‌కు అత్యంత ముఖ్యం. అదేస‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల వారిగా కూడా పార్టీల‌కు మ‌ద్ద‌తు అనేది కీల‌కం. ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు ఉంది. బీజేపీకి బ్రాహ్మ‌ణ‌, క్ష‌త్రియ‌, హిందూ సామాజిక వ‌ర్గాలు అండ‌గా ఉంటున్నాయి. టీడీపీకి క‌మ్మ‌, బీసీలు అండ‌గా ఉంటున్నారు. ఇక‌, వైసీపీకి వ‌చ్చేస‌రికి రెడ్లు అండ‌గా ఉన్నారు. కానీ, ఇది ఒక‌ప్ప‌టిమాట‌. 2014, 2019 ఎన్నిక‌ల్లో మ‌న రాజ్యం రావాలంటూ.. రెడ్లు ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. వైసీపీ అదికారంలోకి వ‌చ్చినా.. గ‌త ఐదేళ్ల‌ల‌కు రెడ్ల‌కు ఒరిగింది ఏమీలేద‌ని.. రెడ్లు ఆవేద‌న‌తో ఉన్నారు. ఇది 2024 ఎన్నిక‌ల్లో రిఫ్లెక్ట్ అయింది. అన్ రిజ‌ర్వ్‌డ్ స్థానాల్లోనూ బీసీల‌కు కేటాయించ‌డం.. రెడ్లు అంటే.. కేవ‌లం ఆ ముగ్గురే అన్న‌ట్టుగా(వైవీ సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి) వ్య‌వ‌హ‌రించ‌డంతో రెడ్లు పార్టీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఈ ఏడాది ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని చెప్పిన చోట కూడా పార్టీ రెక్క‌లు విరిగిపోయాయి.

ఈ పరిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న కీల‌క‌ప‌ద‌వుల్లో రెడ్డివ‌ర్గానికి నియామ‌కాలు చేస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌గిరి పార్టీ ఇంచార్జ్‌గా వేమారెడ్డిని నియ‌మించారు. వాస్త‌వానికి జ‌గ‌న్ చెప్పిన‌ట్టు మంగ‌ళ‌గిరిలో బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో బీసీల‌కు కేటాయించారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డిని ఒప్పించి.. మెప్పించి.. బ్ర‌తిమాలి ఆయ‌న‌ను త‌ప్పించారు.

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో మురుగుడు లావ‌ణ్య ప‌రాజ‌యం పాల‌వ‌డంతో.. జ‌గ‌న్ మ‌ళ్లీ రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వేమారెడ్డిని ఇంచార్జ్‌గా నియ‌మించారు. ఈ ప‌రిణామాల‌తో రెడ్డి వ‌ర్గం కొం త సంతృప్తి వ్య‌క్తంచేసింది. అయితే.. చేయాల్సింది మాత్రంచాలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీలకు లు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రెడ్డి నాయ‌కులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నార‌ని చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరుకే చెందిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి స‌హా అనేక మందిని జ‌గ‌న్ సంతృప్తి ప‌రిచేం దుకు.. ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.