Begin typing your search above and press return to search.

నీకు 15 వేలు... నీకు 18 వేలు... ఫుల్ ట్రోల్స్

పైగా ఆయన పిఠాపురం పర్యటనలో చంద్రబాబుని పూర్తిగా ఇమిటేట్ చేసి మరీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. దాంతో ఇపుడు అదే సోషల్ మీడియాలో తెగ రచ్చ చొస్తోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 12:30 PM GMT
నీకు 15 వేలు... నీకు 18 వేలు... ఫుల్ ట్రోల్స్
X

సామాజిక మాధ్యమాలలో ఇపుడు ఇదే సెన్షేషన్ గా ఉంది. నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు ఏంటి అంటే టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్న మాట. ప్రతీ ఇంటికీ టీడీపీ నేతలు వెళ్ళి ఆ ఇంట్లో ఏ ఒక్కరినీ వదలకుండా ప్రతీ వారికీ టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు అన్నీ చెబుతూ మొత్తం కుటుంబానికే లక్షలలో నగదు బదిలీ పధకాలు వచ్చి అపర కుబేరులు అవుతారు అని చెప్పుకొచ్చారు.

ప్రతీ వెల్ఫేర్ స్కీం లో జగన్ ఇచ్చిన దాని కంటే రెట్టింపు నిధులు పెట్టి మరీ కర పత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశారు. తీరా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలలు సమయం కూడా అవుతోంది. దాంతో ప్రభుత్వం హామీలు ఏవీ నెరవేర్చలేదు.

ఇక విపక్ష నేత జగన్ అయితే చంద్రబాబుని పట్టుకుని నీకు పదిహేను నీకు పద్దెనిమిది వేలు అని ఇంటింటికీ బాబు హామీ ఇచ్చాడా లేదా అని గట్టిగానే గుచ్చుతున్నారు. పైగా ఆయన పిఠాపురం పర్యటనలో చంద్రబాబుని పూర్తిగా ఇమిటేట్ చేసి మరీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. దాంతో ఇపుడు అదే సోషల్ మీడియాలో తెగ రచ్చ చొస్తోంది.

నీకు 15, నీకు 18 అంటూ ఫేస్ బుక్ నుంచి వాట్సప్ ఇన్స్ట్రా గ్రాం, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతోంది. ఫేస్ బుక్ లో షాట్స్ చూసినా లేక ఇన్స్టా రీల్స్ చూసినా ఇదే పంచాయతీగా కనిపిస్తోంది. ఇవే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

వీటిని ఎఫ్ బీ తో పాటు ఇస్ట్రా గ్రామ్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఇవి బాగా పోతున్నాయని అంటున్నారు. జనాల్లో వీటికి రీచింగ్ బాగా ఉందని అంటున్నారు. దీంతో టీడీపీ కూటమికి సెగలూ పొగలూ కమ్ముతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున వైరల్ కావడం అంటే కూటమికి చేటే అని కూడా అంటున్నారు. దాంతో టీడీపీ వారు అవి రాకుండా చేయాలని ఎంత చూసినా వాటిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమే అవుతోంది అని అంటున్నారు.

ఇక చెన్నైలోకి ఒక కంపెనీ ద్వారా వాటిని తీసివేయించాలని చూసినా సాధ్యం కావడం లేదు అని అంటున్నారు. చాలా యూట్యూబ్ చానల్స్ కి అలాగే టీడీపీ పచ్చ చానల్స్ కి స్ట్రైక్ కొట్టిస్తున్నారు కానీ అయినా తగ్గడం లేదు అని అంటున్నారు.

ఇక సాధారణ పిల్లలు యువత కూడా ఇదే బాగుందని ఇన్స్టా లో వీటినే రీల్స్ గా షార్ట్ గా చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇది ఒక ఉద్యమంగా ఊపేస్తోంది. సోషల్ మీడియాలో సాధారణంగా ఎన్నికలు అయ్యాక చప్పగా ఉంటుంది.

ఎక్కడైనా పేలితే ఒకటి రెండు ఇష్యూస్ పేల్తూ ఉంటాయి. కానీ నీకు 15 నీకు 18 మాత్రం ఎవర్ గ్రీన్ గా మారింది అని అంటున్నారు. ఎందుకు అంటే ఆ హామీ పచ్చగా ఉంచి. అందుకే దాన్నే పెట్టి చాలా కొత్త ఆలోచనలతో రీల్స్ చేస్తున్నారుట. మొత్తానికి సోషల్ మీడియా పవర్ ఎంటో ఇపుడు టీడీపీ కూటమి చవి చూస్తోంది అని అంటున్నారు.