జగన్ వచ్చేలోగానే సర్దుకుంటారా ?
ఏపీలో మళ్లీ వైసీపీ పటిష్టం కావడానికి వైసీపీ అధినాయకత్వం గట్టిగానే ఫోకస్ చేస్తోంది.
By: Tupaki Desk | 8 Dec 2024 3:55 AM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది సంక్రాంతి తరువాత జనంలోకి రానున్నారు. ఆయన కార్యకర్తలతో మమేకం కానున్నారు. దీని కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. ఏపీలో మళ్లీ వైసీపీ పటిష్టం కావడానికి వైసీపీ అధినాయకత్వం గట్టిగానే ఫోకస్ చేస్తోంది. దాంతో జగన్ జనంలోకి రావడంతో పాటు పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉండడం అన్న రెండు అంచెల విధానాన్ని అనుసరించడం ద్వారా పార్టీకి భారీ ఎత్తున మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు.
ఇక జగన్ ఎక్కడ నుంచి తన జిల్లాల పర్యటనలు ప్రారంభించాలన్నది చర్చకు వస్తోంది. అయితే జగన్ ఉత్తరాంధ్రా నుంచే తన టూర్లకు శ్రీకారం చుడతారని అంటున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచే తన జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో పార్టీ ని మళ్లీ పునరుజ్జీవింప చేయాలని కూడా చూస్తున్నారు. 2019లో వైసీపీ భారీ మెజారిటీ సాధించడానికి ఉత్తరాంధ్రా జిల్లాలు కారణం అన్నది తెలిసిందే. మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని పార్టీ పెద్దలు చూస్తున్నారు.
మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో పార్టీ నేతలు అంతా సైలెంట్ గా ఉన్నారు. వారిని తట్టి లేపి జనంలోకి పంపించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఎంతో మంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నా కూడా పార్టీలో యాక్టివ్ నెస్ లేదని కూడా అంటున్నారు. అందుకే జగన్ ఉత్తరాంధ్రా నుంచే తన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు.
అయితే జగన్ ఉత్తరాంధ్రా టూర్ కంటే ముందే పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ సర్దుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీలో చేరాలని చూసినా అక్కడ వీలు పడలేదని అంటున్నారు. దాంతో ఆయన జనసేనలో చేరి తన కుమారుడి రాజకీయానికి భరోసా కల్పించాలని చూస్తున్నారు. ఈ మేరక్లు ఆ పార్టీ నుంచి ఆయనకు బంపర్ ఆఫర్ దక్కింది అని అంటున్నారు.
అదే విధంగా విజయనగరం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా చూస్తున్నారు. ఆయన కూడా జగన్ ఉత్తరాంధ్రా టూర్ కి ముందే సంచలన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఆయనకు జగన్ అనేక పదవులు ఇచ్చారని కానీ ఓటమి పాలు అయ్యాక ఆయనకు వారసురాలి బెంగ ఎక్కువ అయింది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుతో పాటు వైసీపీలో ఉన్న పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ రాజకీయాన్ని వెతుక్కునే దిశగా పార్టీలు మారుతారని అంటున్నారు. రానున్న్ అయిదేళ్లలఒ విపక్షంలో ఉండలేక వీరు మారుతున్నారు అని అంటూంటే 2029లో ఎన్నికలు జరిగినా వైసీపీ తిరిగి గెలుస్తుందని నమ్మకం లేకనే చాలా మంది వైసీపీ గూడు విడిచిపోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాల్లో చాలా మంది నేతలు కొత్త ఏడాదిలో తమ ఫ్యూచర్ ని చూసుకుంటారు అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.