Begin typing your search above and press return to search.

కేసీఆర్ జగన్ ఇద్దరూ జనాల్లోకి వస్తున్నారంట !

ఒకరు తెలంగాణా మాజీ సీఎం. మరొకరు ఏపీ మాజీ సీఎం. ఇద్దరూ దాదాపుగా ఆరు నెలల తేడాలో అధికారం కోల్పోయారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:06 AM GMT
కేసీఆర్ జగన్ ఇద్దరూ జనాల్లోకి వస్తున్నారంట !
X

ఒకరు తెలంగాణా మాజీ సీఎం. మరొకరు ఏపీ మాజీ సీఎం. ఇద్దరూ దాదాపుగా ఆరు నెలల తేడాలో అధికారం కోల్పోయారు. ఇద్దరి పనితీరు ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయని అంటారు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితం అయితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అయ్యారు.

ఎన్నికల్లో ఇద్దరూ తమదైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఫలితాలు మాత్రం భారీగానే తేడా కొట్టేశాయి. దాంతో ఇద్దరూ ఇపుడు మాజీ సీఎంలుగా మారి అసెంబ్లీకి సైతం రావడం లేదు. ఇక ఈ ఇద్దరూ ఓడిన తరువాత జనాల వద్దకు కూడా పెద్దగా రావడం లేదు.

అటువంటి నేపథ్యంలో కేసీఆర్ జగన్ ఇద్దరూ జనంలోకి వస్తున్నారు అన్న వార్తలు అయితే ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కేసీఅర్ కానీ జగన్ కానీ అసలు జనాలలోకి రాలేదు అన్న అపవాదు ఉంది. జనాల సంగతి పక్కన పెడితే పార్టీ జనాలను కేడర్ ని కూడా పట్టించుకోలేదు అని తమను గెలిపించిన కార్యకర్తలను కూడా అలా ఉంచేశారు అన్న విమర్శలు ఉన్నాయి.

కేవలం ఈ కారణాల వల్లనే ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు అని విశ్లేషణలు కూడా ఉన్నాయి. చాలా విషయాల్లో ఇద్దరూ గురు శిష్యుల మాదిరిగా ఉండి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నట్లుగానే అన్నీ చేశారు అని కూడా అంటూంటారు. క్యాడర్ ని పూర్తిగా పట్టించుకోకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోశారు అని కూడా చెబుతారు.

ఇక కేసీఅర్ రాజకీయాల్లో అపర చాణక్యుడు అయినా అలాగే జగన్ రాజకీయాల్లో కొత్తగా వచ్చినా క్యాడర్ ని పట్టించుకోకపోతే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. అందుకే ఘోరమైన ఓటమిని ఇద్దరూ చవి చూశారు అని కూడా చెబుతారు

ఇక చూస్తే కేసీఆర్ బీఆర్ఎస్ కి 2018 ఎన్నికల్లో 47 శాతం ఓటు షేర్ వచ్చింది. అది కాస్తా 2023 ఎన్నికల నాటికి 37 శాతం అయింది. ఇక ఆరు నెలలు తిరిగేసరికి 2024 లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకాస్తా దిగజారి 17 శాతం ఓటు షేర్ కి పడిపోయింది అని లెక్కలు ఉన్నాయి. ఇలా చూస్తే కేవలం అయిదేళ్ళ కాలంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కి 30 శాతం ఓట్లు తగ్గిపోయాయని అంటున్నారు.

ఇక జగన్ విషయం తీసుకుంటే 2019 ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ ఉంటే 2024 నాటికి అది కాస్తా 40 శాతం ఓటు షేర్ అయింది. అలా పది శాతం ఓటు షేర్ ఒకేసారి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు క్యాడర్ ని నమ్ముకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఎందుకంటే ఏ పార్టీకి అయినా మూల స్తంభం క్యాడర్ మాత్రమే అని అంటున్నారు. వారు ఉంటేనే పార్టీ గెలుస్తుంది. ఇక కేసీఆర్ అయినా జగన్ అయినా మాస్ లీడర్లు కాబట్టి క్యాడర్ ని నమ్ముకుని ముందుకు సాగితేనే గెలుస్తారు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ జనవరిలో మంచి ముహూర్తం చూసుకుని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు బస చేస్తారని ఆ విధంగా పార్టీ మీద సమీక్ష చేస్తారు అని అంటున్నారు. కేసీఆర్ సైతం జనవరి నుంచి జనంలోకి వస్తారని ఆయన కూడా తెలంగాణాలో పర్యటిస్తూ జనంతోనూ పార్టీ జనంతోనూ మమేకం అవుతారు అని అంటున్నారు.

ఈ విధంగా ఇద్దరు నేతలూ నేల విడిచి సాము చేసినా ఇపుడు మళ్లీ నేల మీద నిలబడి సిసలైన రాజకీయం చేయడానికి కొత్త ఏడాది 2025 ని ఎంచుకున్నారు. మరి ఈ ఏడాది నుంచి ఈ ఇద్దరూ జనంతో కనిపిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగే ఏపీ తెలంగాణా రాజకీయాల్లో భారీ మార్పులు సంభవిస్తాయని అంటున్నారు.

అదే విధంగా పార్టీ క్యాడర్ కనుక ఒక్కసారి పుంజుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ గా అంతా రీ యాక్టివేట్ అవుతారని దాంతో రాజకీయం రసకందాయంలో పడుతుందని అంటున్నారు. మొత్తానికి రెండు చోట్లా విపక్ష రాజకీయం గేర్ మారుస్తుంది అని అంటున్నారు. అధికార పక్షానికి సవాల్ చేసేలా ఇద్దరు నేతలూ జనంలోకి వస్తే ఇక రాజకీయ కుదుపే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.