Begin typing your search above and press return to search.

ధైర్యం నూరిపోయనున్న జగన్

వైసీపీ నేతలలో భయం ఏమిటో టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలలోనే చూపించింది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 12:30 PM GMT
ధైర్యం నూరిపోయనున్న జగన్
X

వైసీపీ నేతలలో భయం ఏమిటో టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలలోనే చూపించింది. లేకపోతే వైసీపీలో నంబర్ టూ అనతగిన విజయసాయిరెడ్డి నాకొద్దీ రాజకీయం అని పార్టీని వదిలేస్తారా అన్నది చర్చగా ఉంది. ఇదిలా ఉంటే దాదాపు పదిహేను రోజులకు పైగా లండన్ లో ఉన్న జగన్ తాడేపల్లి కి చేరుకున్నారు. ఆయన పార్టీ నేతలకు ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారు అన్నది అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అయితే జగన్ పార్టీ నేతలకు ఒక్కటే గట్టిగా చెబుతారని అంటున్నారు. ధైర్యంగా ఉండమని ఆయన కోరుతారు అని అంటున్నారు. తన వెంట ఉంటూ పార్టీలో పనిచేయాలంటే ధైర్యం ఒక్కటే ఆయుధం అని జగన్ గట్టిగా నూరిపోస్తారని అంటున్నారు.

కలలో సైతం ఊహించని విధంగా విజయసాయిరెడ్డి పార్టీని వీడారూ అంటే కూటమి నుంచి ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని అంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి వైసీపీని కొత్త కోణంలో టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఉన్న పార్టీలకు మట్టి అంటకుండా పై స్థాయిలోనే అంతా జరిగిపోతోంది అని అంటున్నారు.

వారంతట వారే పార్టీకి దూరంగా ఉండడం, రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, సైలెంట్ గా ఉండడం వంటివి కొత్త రాజకీయ వ్యూహాలే అని అంటున్నారు. దీని వల్ల కూటమి పార్టీల పాత్ర బయటకు అయితే ఏమిటి అన్నది తెలియదు. విజయసాయిరెడ్డి ఇష్యూలో అదే జరిగిందని అంటున్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఇపుడు టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు

అలాగే ఇంకా చాలా మంది నేతలను జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటారు అని ప్రచారం జరుగుతున్న వేళ మరో నాలుగేళ్ళకు పైగా అన్నీ తట్టుకుని నిలబడాల్సివస్తుందని జగన్ నేతలకు చెప్పనున్నారు అంటున్నారు. పార్టీ కోసం పనిచేయాలంటే కష్టాలను నష్టాలను ఓర్వడమే కాదు కూటమి వైపు నుంచి వచ్చే వాటిని అన్నీ తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని జగన్ పార్టీ క్యాడర్ కి సందేశం ఇస్తున్నారు అని అంటున్నారు.

తనతో ఉండి పోరాడాలసిన వారే కొనసాగుతారు అన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయంగా వైసీపీకి ఉంది అని అంటున్నారు. ఈ సమయంలో పార్టెలెఓ నేతలు అంతా ఒక్కటిగా నిలిచి పోరాడితే మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు.

ఇక దూకుడు నిర్ణయాలను కూడా ఆయన పార్టీ పరంగా తీసుకోబోతున్నారు అని అంటున్నారు. జిల్లాల వారీగా నాయకుల పనితీరుని బేరీజు వేసుకుని మరీ పనిచేసే వారికే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. కూటంతిఓ రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారే వైసీపీని ముందుకు తీసుకెళ్తారని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఎన్ని రకాలైన కేసులు పెట్టాలో అన్నీ పెడతారని వాటికి సిద్ధం అయిన వారే పార్టీకి కావాలన్నది జగన్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అంతే తప్ప ఒత్తిళ్ళు ఉంటాయని జడిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇక పార్టీ కోసం ఎందాకైనా అన్న వారే తనతో ఉండాలని లేని వారు తమ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అన్నదే జగన్ ఇవ్వబోయే డైరెక్షన్ గా ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ తాను రెడీ మీరు రెడీనా అన్నదే నేతలను ప్రశ్నిస్తూ సూచిస్తున్నట్లుగానే అర్ధం చేసుకోవాలని అంటున్నారు. మరి ఎంతమంది ఈ నాలుగేళ్ళకు పైగా పార్టీ కోసం నిలబడి కేసులు అరెస్టులను ఎదుర్కొంటారు అన్నదే చర్చగా ఉంది.