బాబుని జగన్ పొగిడారా...లేక ?
ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్ ల మధ్య రాజకీయం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 9 Dec 2024 3:34 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్ ల మధ్య రాజకీయం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ట్రెడిషనల్ పాలిటిక్స్ హద్దులు దాటి ఈ ఇద్దరి మధ్యన రాజకీయం ఒక భీకర సమరం గానే సాగుతుంది. ఈ ఇద్దరూ మీడియా ముఖంగానే మాట్లాడుకుంటారు. మీడియా కేంద్రంగానే విమర్శించుకుంటారు. కౌంటర్లు ప్రతి కౌంటర్లు అన్నీ మీడియా వేదికగానే జరుగుతుంటాయి.
బాబు యాక్షన్ కి జగన్ రియాక్షన్ ఇస్తే జగన్ చర్యలు బాబు నుంచి ప్రతి చర్య ఉంటుంది. ఇలా మాటల ద్వారా ఈ ఇద్దరూ తూటాలు పేల్చుకుంటారు. సెటైర్లు వేసుకుంటారు. కొన్ని సందర్భాలలో అయితే తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకుంటారు.
లేటెస్ట్ గా చంద్రబాబు మీద జగన్ సెటైర్లు పేల్చారు. అవి ఏంటి అంటే అలా బాబుని చూసిన తాను ఆశ్చర్యపోయాను అన్నారు. మరి బాబుని ఎలా చూసారు ఎందుకు జగన్ ఆశ్చర్యపోయారు అంటే ఆ కధా కమామీషు వేరు అని అంటున్నారు.
బాబులో ఎంతో నటనా కౌశలం ఉందని జగన్ అంటున్నారు. ప్రతీ స్కూల్ లో సహజంగానే జరిగే టీచర్ పేరెంట్స్ మీటింగ్స్ కి అదేదో పెద్ద ప్రోగ్రాం గా మార్చి చంద్రబాబు అక్కడ ప్రదర్శించిన నటనా కౌశలం చూసి ఆశ్చర్యపోయాను అని ఎక్స్ వేదికగా జగన్ సెటైర్లు వేశారు.
ఒక వైపు తల్లిదండ్రులకు తల్లికి వందనం పేరుతో కార్యక్రమం అమలు చేయకుండా సున్నం పెట్టిన బాబు పాఠశాలలకు వచ్చి మాత్రం చాలా హడావుడు చేశారని ఆయన విమర్శిస్తున్నారు. రొటీన్ గా జరిగే సమావేశాలను సైతం తన ప్రచార వేదికలుగా మార్చుకోవడంలో బాబుకు ప్రపంచంలోనే సాటి ఎవరూ లేరంటూ జగన్ ఆయనను పొగిడారా లేక విమర్శించారా అంటే ఆలోచించాల్సిందే మరి.
విద్యారంగం తమ హయాంలోనే బాగుందని నాడు నేడు కింద కొత్త గదులను నిర్మించామని ఆయన చెప్పారు. ఇపుడు వాటి పనులు అన్నీ ఆపేశారని పైపెచ్చు ఏదో చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ చురకలు అంటించారు.
విద్యా రంగంలో తాము సంస్కరణలు తీసుకుని వస్తే చంద్రబాబు మాత్రం ఏమీ చేయకుండానే ఏదో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని జగన్ ఫైర్ అవుతున్నారు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలో ఏకంగా 26 వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఇచ్చిందని బాబు సర్కార్ మాత్రం ఈ రోజుకు పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
పాఠశాలలకు వెళ్ళి స్పీచులు ఇచ్చిన సీఎం బాబు డిప్యూటీ సీఎం పవన్ విద్యా శాఖ మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యక్రమం గురించి ఎందుకు మాట్లాడటం లేదని జగన్ నిలదీస్తున్నారు. తాము ఎంతో కష్టపడి తీసుకుని వచ్చిన సీబీఎస్ ఈ ఎఫిలియేషన్ ని రద్దు చేశారని, టొఫెల్ క్లాసులు ఫ్యూచర్ టెక్నాలజీ కోర్సులు ఇలా అన్నీ రద్దు చేశారని జగన్ అంటున్నారు.
మొత్తానికి చూస్తే కనుక బాబు నటన బాగుందని జగన్ కితాబు ఇస్తున్నారు. బాబుకు ప్రపంచలో సాటి ఎవరూ లేరని అంటున్నారు. బాబు గ్రేటెస్ట్ అంటున్నారు. మరి ఇవన్నీ ప్రశంసలేనా అంటే అది టీడీపీ వైసీపీలకే తెలుసు. అందుకే జగన్ కామెంట్స్ మీద టీడీపీ కామెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.