యాభై రోజులు జనంలోనే... రోడ్ మ్యాప్ రెడీ చేసిన జగన్
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది జనం లోకి రావాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 26 Nov 2024 3:45 AM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది జనం లోకి రావాలని చూస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల పాటు టైం ఇచ్చిన జగన్ ఇపుడు జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తరువాత జగన్ జిల్లాల టూర్లకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ యంత్రాంగం రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది. ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్ల ప్రాతిపదికన జగన్ టూర్ సాగుతుందని అంటున్నారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో జగన్ రెండు రోజుల పాటు మకాం చేస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో పాటు జనంతోనూ మమేకం అవుతారని వారి నుంచి సమస్యల వినతి పత్రాలు తీసుకుంటారని అదే విధంగా గ్రౌండ్ లెవెల్ లో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో వాకబు చేస్తారు అని అంటున్నారు.
ఇక ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ సీట్ల పరిధిలోని పార్టీ ఇంచార్జిలు కీలక నేతలతో జగన్ చర్చిస్తారు అని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎలా ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలో కూడా ఆయన వారికి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు.
పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ లో ఏ విధంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అన్న దాని మీద జగన్ వారితో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది కూడా జగన్ నేరుగా జనాల నుంచే అభిప్రాయ సేకరణ చేపడుతారు అని అంటున్నారు. ప్రభుత్వం అందించే పధకాలు ఏ విధంగా జనాలకు చేరుతున్నాయి, ఇంకా వారికి దక్కాల్సింది ఏముంది వారికి ఏ విషయంలో సంతృప్తి ఉంది, దేని మీద అసంతృప్తి ఉంది అన్నది కూఒడా డైరెక్ట్ గా జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
ఇక వైసీపీ హయాంలో ఏ విధంగా పధకాలు అందాయి, ఇపుడు అందుతున్నాయా లేదా అన్నది కూడా జగన్ బేరీజు వేసి తెలుసుకోనున్నారు. ఇక వైసీపీ పెట్టాక జగన్ నేరుగా పార్టీ నేతలను ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వారిని ఇంతలా కలుకున్నది ఎపుడూ లేదు. అయితే ఇపుడు పూర్తి స్థాయి అట్టడుగు నేతలతో మాట్లాడుతారు అని అంటున్నారు.
ఇక రానున్న రోజులలో తాడేపల్లి కేంద్ర కార్యాలంలో ప్రతీ రోజు ఒక గంట పాటు పార్టీ క్యాడర్ కి కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. పార్టీ నేతలతో పాటు ప్రజలకు కూడా ఈ అవకాశం ఇస్తున్నారు అని అంటున్నారు. దాంతో మొత్తం పార్టీ టాప్ టూ బాటం అంతా ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి జమిలి ఎన్నికల నేపథ్యంలో కూడా జగన్ పార్టీ గేర్ పూర్తిగా మార్చబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి జగన్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది ఏమిటి అన్నది.