'వైసీపీ వార్ రూమ్' ఖాళీ అవుతోందా.. ఏంటీ కథ.. !
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. తాడేపల్లి నివాసాన్ని కేంద్ర కార్యాలయంగా మార్పు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 Sep 2024 12:30 PM GMTవైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. తాడేపల్లి నివాసాన్ని కేంద్ర కార్యాలయంగా మార్పు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో `వార్ రూమ్` పేరుతో ఒక గదిని ఏర్పాటు చేశా రు. దీనిలో జగన్ అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తరచుగా నిర్వహించే సమావేశాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. అయితే.. ఎప్పుడు సమావేశం నిర్వహించినా.. కిటకిట లాడిపోతూ ఉండే ఈ వార్ రూమ్ .. గత కొన్నాళ్లుగా పలచన పడుతోంది.
కొన్నాళ్ల కిందటకు వెళ్తే.. అధికారం కోల్పోయిన నెల రోజులకు జగన్ ఇదే వార్ రూమ్‌లో చర్చలు జరిపారు. అయి తే.. అప్పట్లో ఇది కిటకిటలాడింది. అంతేకాదు.. వ్యతిరేక మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వచ్చా యి. సీనియర్ నేతలకు కనీసం కుర్చీకూడా వేయకుండానే జగన్ అవమానించారంటూ.. పెద్ద కథనాలు రాసుకొచ్చా రు. అంటే.. అప్పటి పరిస్థితి అలా ఉంది. అంటే.. చిన్న రూమే అయినా.. పెద్ద ఎత్తున నాయకులు క్యూ కట్టారు. దీంతో వారికి సరిపోయినన్ని సీట్లు లేక.. నిలబడే చాలా మంది నాయకులు ఉన్నారు.
అయితే.. తాజాగా గురువారం ఉదయం కూడా వార్ రూమ్‌లో జగన్ భేటీ నిర్వహించారు. దాదాపు అందరికీ సమాచా రం ఇచ్చినట్టే ఉన్నారు. ఎందుకంటే.. విజయనగరం, శ్రీకాకుళం నేతలు కూడా హాజరయ్యారు కాబట్టి.. అలానే అనుకోవాలి. అయితే.. ఈ సారి కూడా వార్ రూమ్‌లో నాయకులు కొందరు నిలబడే ఉన్నారు. కానీ, చిత్రం ఏంటంటే .. కుర్చీలు మాత్రం గతంలో మాదిరిగా కాకుండా ఖాళీగానే దర్శనమిచ్చాయి. అంతేకాదు.. వార్ రూమ్ ఆనాడు కిక్కిరిసి పోయి ఉంటే.. ఈసారి మాత్రం పల్చగా మారింది.
ఆనాడు నాయకులు ఒకరినొకరు రాసుకుని కూర్చున్నారు. రాసుకుని రాసుకుని నిలబడ్డారు. కానీ, ఇప్పుడు ఎంత దూరంగా నిలబడ్డా.. మరో ఇద్దరికి ఖాళీ ఉందన్నట్టుగా వార్ రూమ్ కనిపించింది. అంటే.. పిలిచిన వారు రాలేదు. వచ్చిన వారు కూడా.. రూమ్ కు సరిపోయే సంఖ్యలోనూ లేరు. సో.. వార్ రూమ్ ఖాళీగా కనిపించింది. నాయకుల మధ్య జోష్ లేదు. ఏదో జగన్ చెబుతున్నారు. తాము వింటున్నాం.. అనే రీతిలో వచ్చిన వారు దర్శనమిచ్చారు. ఈ పరిణామాలు సోషల్ మీడియాలో అనేక కామెంట్లకు దారి తీస్తున్నాయి. మరి వార్ రూమ్ నిండుతుందా? ఖాళీ అలానే ఉంటుందా? చూడాలి.