Begin typing your search above and press return to search.

వైసీపీకి వరుస షాకులకు రంగం సిద్ధం.. ఒకటి తర్వాత ఒకటి!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎవరి చేతిలో అధికారం ఉంటే.. వారి చుట్టూనే నేతలు తిరగే అలవాటు ఎక్కువైంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 1:30 PM GMT
వైసీపీకి వరుస షాకులకు రంగం సిద్ధం.. ఒకటి తర్వాత ఒకటి!
X

తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎవరి చేతిలో అధికారం ఉంటే.. వారి చుట్టూనే నేతలు తిరగే అలవాటు ఎక్కువైంది. గతానికి భిన్నంగా అధికారం చుట్టూనే నేతలు తిరుగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించి.. ఎదురే లేనట్లుగా ఉన్న వైసీపీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని తీవ్రమైన కుదుపులకు గురి చేస్తోంది.

ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరం కాగా.. ఇప్పుడు మరికొందరు రాజీనామా బాట పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరున్న వారు ఉండటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా.. ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న ఆర్కే రోజా పార్టీకి దూరం కానున్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో రాజకీయం చేయటం తనకు సాధ్యం కాదన్న విషయాన్ని ఆమె గుర్తించారని.. అదే సమయంలో వైసీపీలో ఉండకూడదని డిసైడ్ అయిన ఆమె.. తమిళనాడు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె తీరు ఉంది. సోషల్ మీడియాలో ఆమె వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అన్ ఫాలో కావటం.. ప్రొఫైల్ పిక్ లో మార్పు రావటం నిదర్శనంగా చెబుతున్నారు.

మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మోపిదేవి వెంకటరమణ.. బీదా మస్తాన్ రావులు కూడా రాజీనామా చేస్తారని చెబుతున్నారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లటం.. అక్కడ తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనిచెబుతున్నారు. వీరిద్దరూ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఎప్పటిలానే..పార్టీ మీద ప్రజా వ్యతిరేకత కారణంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతారంటున్నారు.

ఇదిలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖనుఆమె పార్టీ అధినేతకు పంపారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున పార్టీని వీడటం పెద్ద దెబ్బగా చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో పలువురు వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు.