Begin typing your search above and press return to search.

జగన్ కి కోర్టులో భారీ ఊరట!

ఆయన పాస్ పోర్టును అయిదేళ్ళ పాటు రెన్యూవల్ చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 7:30 AM GMT
జగన్ కి కోర్టులో భారీ ఊరట!
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టును అయిదేళ్ళ పాటు రెన్యూవల్ చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ఇటీవల ఆయన పాస్ పోర్టు రెన్యూవల్ మీద విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో కేవలం ఏడాది మత్రమే పాస్ పోర్టు రెన్యూవల్ కి అనుమతి ఇస్తూ తీర్పు చెప్పింది.

ఐతే దాని మీద జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పాస్ పోర్టుని అయిదేళ్లకు రెన్యూవల్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును పరిశీలించాలని ఆయన కోఅరు.

ఈ కేసు విషయంలో ఇరు పక్షాల మద్య వాదనలు కోర్టు విన్నది , విచారణ ముగిసిన తరువాత కోర్టు ఈ నెల 11న తీర్పు వెలువరిస్తామని చెప్పింది. దాని ప్రకారం జగన్ పాస్ పార్టుని అయిదేళ్ల పాటు రెన్యూవల్ చేసేలా బుధవారం హై కోర్టు ఆదేశాలను జారీ చేసింది అయితే ఈ విషయంలో విజవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు 20 వేల పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో చూస్తే కనుక ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి మాత్రమే పరిమితం చేసి జగన్ పాస్ పోర్టు రెన్యూవల్ ని హైకోర్టు అయిదేళ్లకు పొడిగించింది. దీంతో జగన్ కి ఉన్నత న్యాయ స్థానంలో భారీ ఊరట లభించినట్లు అయింది.

ఈ నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. జగన్ వాస్తవానికి ఈ నెల 3 నుంచి లండన్ టూర్ పెట్టుకున్నారు. ఇపుడు వారం రోజులు ఆలస్యంగా ఆయన పర్యటన మొదలు కాబోతోందని అంటున్నారు.