Begin typing your search above and press return to search.

జగన్ పవన్ ఈ సమ్మర్ ని హీటెక్కిస్తారా ?

ఏపీలో రాజకీయం అంటేనే టాప్ రేపే హీట్ తో సాగుతుంది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అలాగే రాజకీయంగా కాకలు తీరిన చంద్రబాబు ఇంకో వైపు ఉంటే దూకుడునే సర్వ కాలాలలోనూ నమ్ముకున్న జగన్ మరో వైపు ఉంటారు.

By:  Tupaki Desk   |   3 March 2025 8:15 AM IST
జగన్ పవన్ ఈ సమ్మర్ ని హీటెక్కిస్తారా ?
X

ఏపీలో రాజకీయం అంటేనే టాప్ రేపే హీట్ తో సాగుతుంది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అలాగే రాజకీయంగా కాకలు తీరిన చంద్రబాబు ఇంకో వైపు ఉంటే దూకుడునే సర్వ కాలాలలోనూ నమ్ముకున్న జగన్ మరో వైపు ఉంటారు. దాంతో ఏపీ రాజకీయాల్లో హీట్ ఎపుడూ ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పాలిటిక్స్ వాడిగా వేడిగా సాగుతుంది.

అధికారాలు అటూ ఇటూ మారుతాయి. వారు వీరు అవుతారు కానీ పాలిటిక్స్ మాత్రం అలాగే ఉంటుంది. సేం టూ సేం అన్నట్లుగానే సాగుతూ వస్తోంది. ఏపీలో చూస్తే 2024 ఎన్నికల వేళ ఎంతటి పొలిటికల్ వార్ నడిచిందో అంతా చూశారు. సరిగ్గా సమ్మర్ లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి.

హోరా హోరీగా పోటీగా మాటల తూటాలను పేల్చారు. విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా అటూ ఇటూ మోహరించి పోరాడారు. మొత్తానికి ఎన్నికలు ముగిసి ఫలితం ఏకపక్షంగా టీడీపీ కూటమిని వరించింది. అది లగాయితూ వైసీపీ గత తొమ్మిది నెలలుగా పెద్దగా సందడి అయితే చేయడంలేదు అధినేత కూడా జనంలోకి రావడానికి చూస్తున్నారు కానీ సరైన ముహూర్తాలు ఫిక్స్ కావడం లేదు.

జగన్ జిల్లా టూర్లు చూస్తే మొదట డిసెంబర్ లో అన్నారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ అన్నారు. మహా శివరాత్రి తరువాత నుంచి అన్నారు. ఇపుడు కొత్తగా ఉగాది తరువాత నుంచి అంటున్నారు. ఇదే ఖాయమని చెబుతున్నారు. అంటే మార్చి 30న ఉగాది పండుగ ఉంటే ఏప్రిల్ నెల నుంచి జగన్ జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అప్పటికి పది నెలల టీడీపీ కూటమి పాలన పూర్తి అవుతుంది కాబట్టి వైసీపీ అధినేత జనంలోకి వెళ్తే మంచి మైలేజ్ వస్తుందని పైగా పొలిటికల్ గా కూటమి మీద వార్ ప్రకటించేందుకు అది సరైన సందర్భం అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట.

సో జగన్ ఏప్రిల్ నుంచి జనంలోకి వస్తారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. అదే సమయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్లీనరీ తరువాత జిల్లాల టూర్లకు రెడీ అవుతున్నారు అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ టూర్ సాగుతుందని అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం వారితో నేరుగా కనెక్ట్ కావడం కూడా చేస్తారు అని అంటున్నారు.

ఇక పవన్ చూస్తే జగన్ కి వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచే తన జిల్లాల టూర్లు స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో జగన్ చూస్తే జనసేన టీడీపీలకు కంచుకోటగా మారిన ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తన టూర్ మొదలెడతారని అంటున్నారు.

జగన్ శ్రీకాకుళం నుంచే తన జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడతారని ప్రచారంలో ఉంటే పవన్ అనంతపురం నుంచి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఉద్దరు నేతలూ ఒకేసారి జిల్లాల టూర్లు చేపడితే ఈసారి సమ్మర్ ఒక్కలా ఉండదని అంటున్నారు. అసలే ఈ సమ్మర్ సీజన్ బాగా వేడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో ఈ పొలిటికల్ హీట్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు.