జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్.. !
వైసీపీ ఇప్పుడు నడిరోడ్డుపైకి చేరింది. నాలుగు రోడ్ల జంక్షన్‌లో నిలబడింది. జీరో నుంచి ప్రస్థానం ప్రారం భించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు.
By: Tupaki Desk | 1 Jan 2025 8:32 AM GMTవైసీపీ ఇప్పుడు నడిరోడ్డుపైకి చేరింది. నాలుగు రోడ్ల జంక్షన్‌లో నిలబడింది. జీరో నుంచి ప్రస్థానం ప్రారం భించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. పార్టీకి ఓటమి ఎదురు కావడం.. ఒక ఎత్తయితే.. దానికి మించిన స్థాయిలో నాయకులు జంప్ చేస్తుండడం మరో పెద్ద విషాదం. బోయీలు పోతే.. పల్లకీని మోసేవారు ఎవరుంటారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్కరు కాదు.. మందలుగానే పోయారు. పోతున్నారు. ఈ పరిస్థితిని ఆపాలి.
ఇదేసమయంలో పార్టీని పుంజుకునేలా చేయాలి. పార్టీ పరంగా అడుగులు బలంగా పడాలి. ఇది జరగకపో తే.. రాజకీయంగా.. వైసీపీ మరో కమ్యూనిస్టు పార్టీమాదిరిగానో.. కాంగ్రెస్ పార్టీగానో మిగిలిపోతుంది. ఈ నేప థ్యంలో వైసీపీకి తక్షణ అవసరం.. వ్యూహకర్త. ఎన్నికలకు ముందు తర్వాత.. పరిణామాలను గమనిస్తే.. వ్యూహకర్త ఉన్నప్పటికీ... ఆ పరిస్థితి వేరుగా సాగింది. ఎవరికి వారు మేనేజ్ చేయడం.. పార్టీప రంగా అతిగా ఊహించుకోవడం వంటివి.. వైసీపీకి మైనస్ అయ్యాయి.
ఇప్పుడు కావాల్సింది.. అలాంటి వ్యక్తులు.. వ్యూహకర్తలు కాదు. పక్కాగా పార్టీని నడిపించేవారు కావాలి. జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్ అడుగులు వేయాలనిభావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే .. ఒకరకంగా 2012 నాటి పరిస్థితిని ఆయన ఊహించుకుంటున్నారు. ఆయన చుట్టూ ఇంత పెద్ద కోటరీ లేదు. ఉన్నది పట్టుమని పది నుంచి 50 లోపు నాయకులే. వీరితోనే ఆయన ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఇదే పంథాను జగన్ ఎంచుకుంటున్నారు.
అయితే.. అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. అసలుపాలన చేయని జగన్ వైపు జనం చూశారు. కానీ.. ఇప్పు డు ఐదేళ్ల పాలన చవిచూశారు. కాబట్టి.. ఆ పాలనలోని లోపాలను సరిచేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తే.. పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. ఒక్క విషయం మాత్రం జగన్ గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి అధికారం అంటూ దక్కితే.. దానిని ఎన్ని వ్యయ ప్రసాలకు ఓర్చుకునైనా.. నిలబెట్టుకునే మంత్రాంగం ఉండాలి. ఇది ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న ఫార్ములా. ప్రధాని మోడీని చూస్తే.. ఇది ఖచ్చితంగా మనకు గోచరిస్తుంది. అలా చేయకపోతే.. జగన్ ఎప్పటికీ కోలుకోలేరనడంలో సందేహం లేదు.