జగన్ ను సభకు రావటానికి అలా చేయాలట..ఆది ఐడియా విన్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు రప్పించటం.. ఆయన్ను సభలో ఉంచి మాట్లాడేలా చేయటం కోసం జరుగుతున్న కసరత్తు అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 26 Feb 2025 5:02 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు రప్పించటం.. ఆయన్ను సభలో ఉంచి మాట్లాడేలా చేయటం కోసం జరుగుతున్న కసరత్తు అంతా ఇంతా కాదు. తాజాగా ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జగన్ సభకు రావాలన్న ఆయన.. అందుకోసం ఏపీ స్పీకర్ కానీ.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామక్రిష్ణరాజు కానీ ఆయన్ను కలవాలన్న సూచన చేయటం ఆసక్తికరంగా మారింది.
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఛైర్ లో కూర్చున్న వేళ.. మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి.. ‘‘మీరు కానీ స్పీకర్ కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలి. ఆయనకు ఎక్కువసేపు మైకు ఇస్తాం. వచ్చి మాట్లాడాలని కోరండి. కావాలంటే మీ వెంట నేనూ వస్తాను. తమ ఎమ్మెల్యేలకు రెండు నిమిషాల చొప్పునే సమయం ఇస్తున్నారని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అంటుననారు. 11 మంది ఎమ్మెల్యేలకు కలిపి 22 నిమిషాల్ని జగనే మాట్లాడొచ్చు కదా?’ అంటూ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి జగన్ రావాలి.. కావాలి అని మీరు కోరుకుంటున్నారు కానీ.. అది నెరవేరేలా కనిపించటం లేదన్న డిప్యూటీ స్పీకర్ రఘరామ రాజు వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ‘మీ వెంట నేనూ వస్తా జగన్ దగ్గరకు వెళదాం’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి జగన్ ను సభకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న కసరత్తు చూస్తే.. ఆయనకు ఏదో రకంగా సభకు తీసుకురావాలన్న తపన కూటమికి చెందిన కొందరునేతల్లో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుందని మాత్రం చెప్పకతప్పుద.