Begin typing your search above and press return to search.

బాబు ఒట్టేసుకున్నారా ?

రాజకీయ స్వర్ధం కోసం హామీలను నెరవేర్చకుండా ఫెయిల్యూర్ పాలనను అందించినందుకు బాబు డైవర్షన్ పాలిటిక్స్ ని తెచ్చారని అన్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 1:52 PM GMT
బాబు ఒట్టేసుకున్నారా ?
X

ఏపీలో శ్రీవారి లడ్డూ ఇష్యూ విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. అది అన్ని పార్టీలకు శిరోధార్యం గానే ఉంది. అయితే ఆ తీర్పును అనుసరించి కూడా టీడీపీ వైసీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ పాపాలు పండాయి అని టీడీపీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయడం పట్ల జగనే ఫైర్ అయ్యారు. పాపాలు చేసింది చంద్రబాబు అని ఆయన మండిపడుతున్నారు. రాజకీయ స్వర్ధం కోసం హామీలను నెరవేర్చకుండా ఫెయిల్యూర్ పాలనను అందించినందుకు బాబు డైవర్షన్ పాలిటిక్స్ ని తెచ్చారని అన్నారు.

చంద్రబాబు రాజకీయానికే సుప్రీంకోర్టు తీర్పు సరైన జవాబు అని కూడా అన్నారు. ఈ విధంగా లడ్డూ ఇష్యూలో జగన్ వరసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే అవతల మాత్రం మంత్రులు జగన్ కి కౌంటర్ ఇస్తున్నారు కానీ చంద్రబాబు అసలు ఏమీ మాట్లాడడం లేదు.

పైగా పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. బాబు ఈ విషయంలో ఒట్టు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన ఆఖరుసారిగా లడ్డూ గురించి మాట్లాడింది గత నెల 27 తేదీన ప్రెస్ మీట్ పెట్టి అని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత బాబు ఈ విషయం మీద మాట్లాడలేదు.

అయితే వైసీపీ మాత్రం దీనిని అలా కొనసాగిస్తోంది. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఈ టాపిక్ మీద నిన్నటి వారాహి సభలోనూ మాట్లాడుతున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు ఎందుకో ఈ టాపిక్ ని వదిలేసినట్లుగానే ఉంది.

ఇపుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్షన్ లో ఐదుగురు సభ్యులతో నియమించిన కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తుందని ఆ మీదటనే స్పందిస్తే బాగుంటుంది అని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది అని అంటున్నారు. అందుకే బాబు జగన్ ప్రెస్ మీట్లు పెట్టి టార్గెట్ చేస్తున్నా తన మంత్రులతోనే కౌంటర్ ఇప్పిస్తున్నారు తప్ప తాను మాత్రం అసలు జోక్యం చేసుకోవడం లేదు.

మరో వైపు చూస్తే లడ్డూ ప్రసాదం ఇష్యూ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది అని అంటున్నారు. వైసీపీ తన మీద పడిన నిందను తప్పించుకోవడానికి చూస్తోంది. సీబీఐ విచారణను నేరుగా జరపాలని డిమాండ్ చేసింది. తెలుగుదేశమే ఈ ఇష్యూని మొదట రైజ్ చేసింది కాబట్టి కల్తీ జరిగింది అంటోంది. అపచారాలు చోటు చేసుకున్నాయని చెబుతోంది. మిత్ర పక్షం జనసేన కూడా ఇదే రకమైన వాదన వినిపిస్తోంది.

ఇపుడు అయిదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయింది.

ఈ నివేదిక ఎపుడు వస్తుంది ఏమి చెబుతుంది అన్నది కూడా ఉత్కంఠంగా ఉంది. అయితే మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్ గురించే అన్నారు. ఆయన రాజకీయ విమర్శలు లడ్డూ విషయంలో చేస్తున్నారు అని అన్నారు. మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్ తన అయిదేళ్ళ పాలనలో హిందూ దేవాలయాల విషయంలో దాడులు జరిగినా పట్టించుకోలేదని అన్నారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు లడ్డూ ఇష్యూ మీద మాట్లాడేది లేదు అన్నట్లుగానే ఉంది. ఇక జగన్ అండ్ కో కూడా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు. నివేదిక ఏమి వస్తుందో ఏమి తెలుస్తుందో అంతా చూడాల్సి ఉంది అని అంటున్నారు.