నాడు బాబు ఇంటిపై దాడి.. నేడు జగన్ ఇంటికి రక్షణ!
వైసీపీ హయాంలో టీడీపీ అధినేత ఇంటిపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్.. తన మందతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2025 7:17 AM GMTరాజకీయాల్లో శత్రుత్వం కాదు.. పరిణితి ఉండాలని చెప్పేందుకు.. ఇది చక్కటి ఉదాహరణ. వైసీపీ హ యాంలో ప్రతిపక్ష నాయకులను.. శత్రువులుగా చూస్తే.. ఇప్పుడు కూటమి హయాంలో ప్రతిపక్షాన్ని ప్రత్య ర్థులుగానే పరిగణిస్తున్నారు.. తప్ప.. శత్రువులుగా చూడడం లేదన్న విషయాన్ని తాజా ఘటన అద్దం పడుతుంది. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత ఇంటిపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్.. తన మందతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే.
టీడీపీ సీనియర్ నేత ఒకరు వైసీపీ అధినేతను దూషించారని, దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. అప్పట్లో జోగి యాగీ చేశారు. ఏకంగా..చంద్రబాబు ఇంటిపైకి దాడి చేసేందుకు కర్రల తోనూ వెళ్లారని.. టీడీపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ కనీసం స్పందించలేదు. అప్పటి విపక్ష నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేత, తండ్రి సమానుడైన చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండించనూ లేదు.
అదేసమయంలో అప్పటి డీజీపీతోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారు. ప్రజాస్వామ్యంలో దాడులు కూడా నిరసనేనని సవాంగ్ చెప్పడం తెలిసిందే. ఇలా.. అప్పట్లో జగన్ వ్యవహరిస్తే.. తాజాగా చంద్రబాబు మాత్రం జగన్ ఇంటికి రక్షణ పెంచారు. ఇటీవల జగన్ ఇంటి ముందు.. అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ఉద్దేశ పూర్వకంగా చేశారో.. లేక.. ప్రమాదవశాత్తు జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వ సూచనలతో తాడేపల్లి ప్యాలస్ దగ్గర.. డిజిటల్ రక్షణలో భాగంగా పోలీసులు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోనిజగన్ ఆఫీసు, ఇంటిని కవర్ చేసేలా.. వీటిని ఏర్పాటు చేయడం గమనా ర్హం. తద్వారా.. అసాంఘిక శక్తులు.. కానీ, మరెవరైనా కానీ.. జగన్ ఇంటిపై దాడి చేయకుండా..ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు అయింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించినట్టు పోలీసులు చెబుతున్నారు. సో.. ఇదీ.. గతానికి, ఇప్పుటికీ తేడా!