నా భద్రతపై నిలదీయండి: జగన్ దిశానిర్దేశం
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి కష్టాలను మండలిలో లేవనెత్తాలని జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 24 Feb 2025 3:40 AM GMTసోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ, శాసన సభ రెండూ సమావేశం కానున్నాయి. 2025-26 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష (ప్రధాన కాదు) వైసీపీ అధినేత జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తాడేపల్లి ఆఫీసు వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి కష్టాలను మండలిలో లేవనెత్తాలని జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
``అసెంబ్లీలో మనకు ఎలానూ సమయం ఇవ్వరు. మనం ఎంత పోరాడినా.. మైకు రాదు. అయినా .. మనం పోరాటం చేద్దాం. మనకు ఉన్నది కౌన్సిల్ మాత్రమే(మండలి). ఇక్కడ మాత్రం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అన్ని విధాల నిలదీయాలి. అందరూ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి.`` అని జగన్ సూచించారు. ఇదేసమయంలో గుంటూరు మిర్చియార్డు సందర్శన సంద ర్భంగా తనకు భద్రతకల్పించకపోవడాన్ని ఉభయ సభల్లోనూ నిలదీయాలని కూడా జగన్ నిర్దేశించారు.
ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల రెచ్చగొట్టే విధానంపై ఎవరూ స్పందించవద్దని.. అలా చేసి.. సభ కాలాన్ని వారు హరించే ప్రయత్నం చేసి.. మనకు అవకాశం రాకుండా చేస్తారని జగన్ చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో ఆవేశం పక్కన పెట్టి.. ప్రజల దృష్టికి మన ప్రయత్నాలు వెళ్లేలా పక్కాగా వ్యవహరించాలని.. పేర్కొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
బొత్స మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా మన హక్కులు వినియోగించుకుంటూనే .. ప్రజలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. గ్రూప్-2 పరీక్షలు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంటు, మిర్చి రైతుల ఆందోళన వంటివి ప్రస్తావించాలనిదిశానిర్దేశం చేశారు. కాగా.. ఈ టెలీ కాన్ఫరెన్సులో ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు పాల్గొని తమ తమ సమస్యలు చెప్పగా.. వాటిని సభలోనే ప్రస్తావించాలని జగన్ సూచించారు.