Begin typing your search above and press return to search.

ఫర్నిచర్ సరెండర్ చేసిన జగన్

ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అందులో కోరారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 5:30 PM GMT
ఫర్నిచర్ సరెండర్ చేసిన జగన్
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ ని సరెండర్ చేశారు. వెంటనే వచ్చి సర్కార్ ఫర్నిచర్ సరెండర్ చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాధారణ పరిపాలన విభాగానికి పార్టీ తరఫున రాసిన లేఖను అందచేశారు

ఇప్పటికే జూన్ 15, 19, జూలై 1, జూలై 29న నాలుగు సార్లు సాధారణ పరిపాలనా విభాగానికి వైసీపీ లేఖలు రాసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అందులో కోరారు.

ఇపుడు మరోసారి లెటర్ ఇచ్చి వచ్చారు. ఇక చూస్తే ఏ రకమైన ఫర్నిచర్ ఎంత ఉంది ఏమిటి అన్న దాని మీద కేటగారికల్ గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మరీ లెటర్ తో పాటు ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత తొందరగా తన పార్టీ ఆఫీసు నుంచి సర్కార్ కి చెందిన ఫర్నిచర్ ని స్వాధీనం చేసుకోవాలని కూడా వైసీపీ కోరింది.

ఇదిలా ఉంటే జగన్ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుని ఇపుడు వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చారు. దాంతో పాటు ఇక మీదట దానికి పొలిటికల్ ఆఫీసు షేప్ తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఫర్నిచర్ అంతా అక్కడ ఉండడం వల్ల స్థలాభావం సమస్య కూడా ఉందని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి కూడా జగన్ మీద విమర్శలు వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ ని సరెండర్ చేయలేదని కూడా ఆరోపణలు చేశారు. దానికి మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు ధీటైన బదులు ఇచ్చారు. ఫర్నిచర్ తో కక్కుర్తి పడే రకం తాము కాదని అన్నారు. మీ ఫర్నించర్ ఎవరికి కావాలి అని కూడా అన్నారు. దాని ధర ఎంతో చెబితే పైసాతో సహా చెల్లిస్తామని కూడా చెప్పారు.

అది జరిగిన తరువాత కూడా ఇన్నాళ్ళ పాటు జగన్ తాడేపల్లి ఆఫీసులోనే ప్రభుత్వం ఫర్నిచర్ ఉంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో దీని మీద ఎవరూ మాట్లాడింది కూడా లేదు. అయినా కూడా సడెన్ గా మరోసారి లెటర్ రాసి మరీ వైసీపీ సరెండర్ చేయాలనుకోవడం విశేషమే అంటున్నారు.

మరి ప్రభుత్వం ఈ ఫర్నిచర్ ని తీసుకోవ్డానికి చర్యలు చేపడుతుందా లేక ఏమైనా కామెంట్స్ ప్రభుత్వ పెద్దల నుంచి వస్తాయా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా వైసీపీ ఈ విషయంలో సీరియస్ గానే ఉందని అంటున్నారు. ఫర్నిచర్ ని ఇచ్చేయడానికి తాము ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నామని అయినా సరే తమ మీద ఆరోపణలు చేస్తే సహించేది లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.