జగన్ మాటంటే ట్వీటే !
వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్ పిట్ట పలుకులు పలుకుతున్నారు. తాను ఏ చెప్పాలన్నా.. ట్విట్ట ర్ ద్వారానే చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2024 11:30 AM GMTవైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్ పిట్ట పలుకులు పలుకుతున్నారు. తాను ఏ చెప్పాలన్నా.. ట్విట్ట ర్ ద్వారానే చెబుతున్నారు. విమర్శలు చేయాలన్నా.. సూచనలు చేయాలన్నా.. కూడా ఆయన ట్విట్టర్‌నే ఎంచుకున్నారు. అయితే.. వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌కు ఇలా చేయడం సరైన విధా నం కాదన్న వాదన వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ప్రజాదరణ లేని నాయకులు.. లేదా.. సమయం, తీరుబడి లేని వారే ట్విట్టర్‌ను ఎంచుకుంటారు.
ముఖ్యంగా ప్రజలకు కొత్తగా పరిచయం అయ్యేవారు.. లేదా.. రాజకీయాల్లో విరామం లేకుండా ఉన్నవారు ట్విట్టర్ ద్వారా తాము చెప్పాలని అనుకున్న విషయాలను చెబుతారు. వాటిని ఎక్కువ మంది చదువు తారా? లేదా? అనేది సంబంధం లేకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. కానీ, జగన్ విషయానికి వస్తే.. మాత్రం ప్రజాదరణ ఉన్న నాయకుడే కాకుండా.. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకులు కూడా ఉన్నారు.
ఇక, మీడియా పరంగా సొంతగానే ఆయనకు మీడియాకు ఉంది. ఎంత సేపు మాట్లాడినా లైవ్ ఇచ్చే చానె ళ్లు కూడా ఉన్నాయి. అయినా.. జగన్ మాత్రం పిట్టపలుకులకే పరిమితం అయ్యారు. ఈ పరిణామాలు.. ఆయనకు ఊపు తీసుకురాకపోగా.. అసలు ప్రజల్లోకి కూడా చేరడం లేదు. ఇక, వీటిని చూస్తున్నవారి స్పం దన కూడా అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఇసుక విధానం, లాటరీ, మాఫియా అంటూ.. సుదీర్ఘ ట్వీట్ చేశారు. కానీ, దీనిని ఎక్కువ మంది పట్టించుకోలేదు.
అదేసమయంలో పార్టీ పరంగా కూడా జగన్‌కు పెద్దగా స్పందన రావడం లేదు. ప్రజల్లోకి వస్తే.. అక్కడ మాట్లాడితే.. ఉండే ఊపు, ఉత్సాహం ఎక్కువగా ఉంటుందని.. దీనివల్ల పార్టీ పుంజుకునేందుకు.. ముఖ్యం గా ప్రజలు చర్చించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. నాలు గు గోడల మధ్య కూర్చుని.. ట్విట్టర్‌కే పరిమితమైతే.. పార్టీ మాట ఎలా ఉన్నా.. జగన్‌ను కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.