జగన్ వీడియో వైరల్...మీడియా ముందే అలా ?
జగన్ జైలులో ఉన్న తన పార్టీ మాజీ ఎంపీ సురేష్ ని పరామర్శించి వచ్చారు.
By: Tupaki Desk | 11 Sep 2024 5:59 PM GMTవైసీపీ అధినేత జగన్ మీడియా ముందు తనదైన ఫ్రస్ట్రేషన్ చూపించారా అంటే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అయితే అదే నిజం అంటోంది. జగన్ జైలులో ఉన్న తన పార్టీ మాజీ ఎంపీ సురేష్ ని పరామర్శించి వచ్చారు.
బయట ఆయన కోసం వేచి చూస్తున్నారు పాత్రికేయులు చాన్నాళ్లకు బయటకు వచ్చిన మాజీ సీఎం ఏమి చెబుతారో అన్న ఆతృత వారిది. అయితే జగన్ వచ్చిన వెంటనే తన చేతిలో ఉన్న కాగితాలను తీసుకుని చదవడం మొదలెట్టారు. సాధారణంగా జగన్ అంతే.
తన వెంట తెచ్చుకున్న కాగితాలలోని మ్యాటర్ ని చూస్తూ చదవడం ఆయన అలవాటు. దాని మీద ఎంతలా ట్రోలింగ్ జరిగినా ఆయన అలా చేయడానికే ఇష్టపడతారు. అలా టీడీపీ మీద దట్టించిన విమర్శలు చేశారు అయితే ఆ కాగితాల ప్రసంగాలను చూసి ఏమనుకున్నారో ఏమో కానీ పాత్రికేయులు జగన్ ని ప్రశ్నలు అడిగారు. దాంతో జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో తెలియచేస్తోంది
మీడియాకు కాగితాలు ఇచ్చేసి తాను వెళ్ళిపోతాను అని జగన్ అంటున్నారు. మీడియా తాను చెప్పినట్లుగానే చేయాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. జగన్ అయితే తాను చెప్పదలచుకున్న దానిని అంతా కాగితాలలోనే ఉన్నది చదువుతాను అని రొటీన్ వైఖరినే అనుసరిస్తున్నారు. దాంతో మీడియా జగన్ ని తాము అడగాల్సినవి అడగాలని ఆరాటపడుతోంది.
దీంతోనే ఆయనకు కోపం వస్తోంది అని అంటున్నారు. జగన్ మీడియా విషయంలో ఎలా డీల్ చేయాలో ఒక సీఎం గా పనిచేసినా కూడా తెలుసుకోలేకపోతున్నారా అన్నదే అంతా అంటున్న విషయం. మీడియా సమావేశం అంటే తాను తెచ్చుకున్న కాగితాలను వల్లె వేసి అక్కడ నుంచి వెళ్లిపోవడం కాదని వారు అడిగే ప్రశ్నలకూ జవాబు చెప్పాల్సి ఉంటుందని జగన్ అనుకోవడం లేదా అని అంటున్నారు.
జగన్ రెగ్యులర్ గా మీడియా సమావేశాలు పెట్టే నాయకుడు కాదు, అసలు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఏ రోజూ మీడియాను పిలిచిన సందర్భాలు అయితే లేవు అని అంటున్నారు. ఇపుడు విపక్షంలోకి వచ్చాక జగన్ మీడియాను అపుడపుడు కలుస్తున్నారు.
అయితే తాను తెచ్చుకున్న కాగితాల ప్రసంగం ముగిసిన తరువాత వడివడిగా జగన్ వెళ్ళిపోతూంటారు. జగన్ సార్ అని మీడియా ఎంత పిలిచినా ఆయన పలకరు అని కూడా అంటూంటారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ గుంటూరు లో జైలు వద్ద మీడియాతో ఫైర్ అవడం వారి మీద తన ఫ్రస్ట్రేషన్ ని చూపించడం మాత్రం ఆయన ప్రత్యర్ధులకు ఆయుధంగా మారుతోంది.
మీడియాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. తీరా వచ్చి తాను తన స్టైల్ లో స్పీచ్ ఇస్తాను అంటే మీడియా కూడా ప్రశ్నలు అడుగుతుంది కదా అని అంటున్నారు. మొత్తానికి జగన్ అయితే ఈ విధంగా వ్యవహరించడం ద్వారా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు అని అంటున్నారు.