జగన్ దిగొస్తున్నారు... వైసీపీ హాట్ టాపిక్ ..!
నిన్న మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి. పైగా ముఖ్యమంత్రి కుమారుడు.
By: Tupaki Desk | 14 Sep 2024 8:30 PM GMTనిన్న మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి. పైగా ముఖ్యమంత్రి కుమారుడు. దీంతో మందీమార్బలాలు.. అధికా రుల ప్రొటోకాల్. ఎక్కడకు వెళ్లినా ఎర్ర తివాచీల స్వాగతాలు. చీమను కూడా దరిచేరనివ్వంత మర్యాదలు.. గౌరవా లు.. గజమాలలు. ఇదే శాశ్వత మనుకున్నారు. ఇంక తిరుగులేదని లెక్కలు కూడా వేసుకున్నారు. ఆయనే వైసీపీ అధినేత జగన్. కానీ, ప్రజా తీర్పు మరోలా ఉంది. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. అంత ప్రోటోకాల్ కూడా పోయింది.
సహజంగా అప్పటి వరకు.. గజరాజును ఎక్కి విహరించిన రారాజు.. వెంటనే గాడిదనెక్కాల్సిన పరిస్థితి వస్తే.. ఇబ్బం ది పడినట్టే.. మొహం చెల్లనట్టే.. జగన్ పరిస్థితి కూడా మారిపోయింది. దీంతో రెండు మాసా లవరకు జగన్ ప్రజల మధ్యకు రాలేక పోయారు. ఈ పరిస్థితి మంచి కాదని.. పార్టీ నాయకులు , మీడియా కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రజలు ఆయనను గెలిపించారని.. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ధర్మం ఆయన పాటించాలని కూడా సూచనలు వచ్చాయి. కానీ, జగన్ ఇవేవీ పట్టించుకోలేదు.
కళ్ల ముందు ఇంకా.. ఘన సత్కారాలు.. గౌరవ మర్యాదలు కనిపిస్తుంటే.. ఆయన మాత్రం ఏచేస్తారన్న ప్రశ్న తెరమీ దికి వచ్చింది. అందుకే.. అంతా మౌనంగా గడిపేశారు. కానీ, పరిస్థితులు అలా లేవు. ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో దిగి రాకతప్పలేదు. ఆ వెంటనే పర్యటనలకు రెడీ అయ్యారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలుసుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు కొంత ఊరట పొందారు. నిన్న మొన్నటి వరకు అభద్రతా భావంతో ఉన్న వారు కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
``ఇంక ఆయన ప్రజల్లోనే ఉంటారు. మాకు ప్రజా సమస్యలు కొత్తకాదు. మానాయకుడు ప్రజల సమస్యలకు ఎక్కువ గా ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఇక నుంచి ప్రజల్లోనే ఉంటారు. ఈ పర్యటన కాగానే(పిఠాపురం) విజయవాడకు చేరుకుంటారు. అక్కడ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరద బాధితులను పరామర్శిస్తారు`` అని వైసీపీ నాయకులు చెప్పారు. కానీ, చిత్రం ఏంటంటే.. పిఠాపురం పర్యటన ముగిసిన వెంటనే జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో దిగి వచ్చారని నాయకులు సంబరాలు చేసుకున్న సమయం పెద్దగా నిలవలేదు. మరి జగన్ వ్యూహం ఏంటో చూడాలి.