స్వామీ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు
అదే సమయంలో ఆయన తనలోని పాత ఫైర్ ని గుర్తుకు తెచ్చేలా హీటెత్తించే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 3:35 AM GMTఏపీ మాజీ సీఎం వర్సెస్ నారా లోకేష్ గా లేటెస్ట్ పాలిటిక్స్ టర్న్ తీసుకుంటోంది. జగన్ లండన్ నుంచి వస్తూనే తాడేపల్లి కేంద్రంగా పార్టీ నేతలతో వరస భేటీలు పెడుతున్నారు. అదే సమయంలో ఆయన తనలోని పాత ఫైర్ ని గుర్తుకు తెచ్చేలా హీటెత్తించే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
తనలో వన్ పాయింట్ ఓ ని గతంలో చూసారని ఇపుడు టూ పాయింట్ ఓ గా ముందుకు వస్తాను అని జగన్ పార్టీ మీటింగులో వేడెక్కించే స్టేట్మెంట్ ఇచ్చారు. తమ పార్టీ వారిని కూటమి నేతలు ఏమీ చేయలేరని జగన్ అన్నారు. వైసీపీ కార్యకర్త వెంట్రుక సైతం పీకలేరని ఆయన ఆవేశభరితమైన ప్రకటనలే చేశారు.
దీనికి ఢిల్లీ టూర్ లో ఉన్న లోకేష్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వన్ పాయింట్ ఓ పాలనతోనే విసిగి వేసారి జనాలు ఉన్నారు స్వామీ అని జగన్ మీద సెటైర్లు వేశారు. వైసీపీ అయిదేళ్ళ పాలనను ఎవరూ మరచిపోలేదని అన్నారు వైసీపీ హయాంలో దళితుల నుంచి బీసీల నుంచి అన్ని వర్గాలు ఎంతో ఇబ్బంది పడ్డాయని అన్నారు. తన మీదనే ఏకంగా 23 కేసులు పెట్టారని ఆయన చెప్పారు.
తన పార్టీ నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయని అన్నారు. ఏపీలో అయిదేళ్ళ కాలంలో మాట్లాడే స్వేచ్చ లేకుండా చేశారని ఆయన విమర్శించారు. బయటకు వెళ్ళకుండా తమ ఇంటికే తాళ్ళు కట్టి నిర్భందించారని దానిని ఎవరు మరచిపోతారని అన్నారు. తాము వైసీపీ నేతల తప్పులను రూల్స్ ప్రకారమే చట్టం ముందు ఉంచి శిక్షిస్తామని రెడ్ బుక్ గురించి జనంలో చెప్పామని అన్నారు.
ఏపీలో అయిదేళ్ళ వైసీపీ పాలనలో పెట్టుబడులు ఏమి వచ్చాయని ఆయన నిలదీశారు. తమ ఎనిమిది నెలల పాలన వైసీపీ అయిదేళ్ళ పాలన మీద చర్చకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ తనతో డిబేట్ కి వస్తే తాము ఏమేమి పెట్టుబడులు తెచ్చామో వివరిస్తామని అన్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెట్టుబడిదారులను ఏపీ నుంచి తరిమేశారని అన్నారు. అమర్ రాజా కంపెనీ సహా అనేక సంస్థలు అలా వెళ్ళిపోయినవే అన్నారు.
ఈ రోజుకు కూడా పారిశ్రామికవేత్తలు ఏపీ అంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు. జగన్ మళ్ళీ వస్తే సంగతేంటి అని వారు అడుగుతున్నారని తాము అలా ఎప్పటికీ జరగదని చెబుతున్నామని అన్నారు. ఏపీ ఇమేజ్ ని తిరిగి తెస్తున్నామని నష్టపోయిన ఏపీని దారిన పెడుతున్నామని అన్నారు. జగన్ తన పాలన గురించి మరచిపోయి టూ పాయింట్ ఓ అని చెప్పడాన్ని లోకేష్ తప్పు పట్టారు.
ఇక జగన్ అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలు మాట్లాడాలని కోరారు. ప్రజలు జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని వారే గుర్తించకపోతే తామేమి చేస్తామని లోకేష్ అన్నారు. జగన్ సీఎం గా ఉన్నపుడు ఒక నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తే టీడీపీకి విపక్ష హోదా ఉండదని చెప్పిన మాటను మరచారా అని నిలదీశారు.
మరి ఆయనకు ఆనాడు ఇదే రూల్ వర్తిస్తుందని తెలిసినపుడు ఇపుడు ఎలా విపక్ష హోదా అడుగుతారని లోకేష్ అన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఎవరికి పీకి పక్కన పెట్టారో అర్ధమైనా ఇంకా ఏమీ చేయలేరని మాట్లాడితే ఎలా అని వైసీపీ అధినాయకత్వాన్ని ఎద్దేవా చేశారు. మొత్తానికి చూస్తే జగన్ తో ముఖాముఖీకి రెడీ అని లోకేష్ అంటున్నారు. మరి తన హయాంలో ఎన్ని పెట్టుబడులు తెచ్చామో కూడా చెబుతామని అంటున్నారు. జగన్ రెడీనా అని సవాల్ చేస్తున్నారు. మరి వైసీపీ అధినేత ఈ సవాల్ మీద ఏమంటారో చూడాల్సి ఉంది.