Begin typing your search above and press return to search.

సడెన్ గా విదేశాలకు జగన్...ఎందుకంటే...?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. జగన్ యూకే టూర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 3:39 PM GMT
సడెన్ గా విదేశాలకు జగన్...ఎందుకంటే...?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. జగన్ యూకే టూర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఆయన సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో జగన్ మీద సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపధ్యంలో దేశం విడిచి వెళ్లరాదని షరతులు ఉన్నాయి. ఒకవేళ విదేశీ ప్రయాణం చేయాలంటే కోర్టు నుంచి అనుమతి పొందాలి. దాని మీద సీబీఐ అభ్యంతరాలు లేకుండా చూడాలి.

అందుకే జగన్ తన విదేశీ టూర్ కోసం గతంలో కూడా సీబీఐ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. జగన్ చివరి సారిగా గత ఏడాది విదేశీ పర్యటన చేపట్టారు. పెట్టుబడుల సదస్సు కోసం ఆయన అప్పట్లో మంత్రి వర్గంలోని కీలక మంత్రులను ఉన్నతాధికారులను దావోస్ తీసుకుని వెళ్లారు. మొత్తం పది రోజుల పాటు జగన్ విదేశీ టూర్ అప్పట్లో సాగింది.

ఇక ఆ తరువాత నుంచి జగన్ విదేశీ టూర్ అయితే లేదు. ఆ మధ్యన ఆయన విదేశీ టూర్లు అయితే పెట్టుకోవడంలేదు. ఆయన ఇద్దరు కుమార్తెలు లండన్ లో చదువుతున్నారు అని చెబుతారు. దాని కోసం జగన్ విదేశాలకు వెళ్ళాల్సి ఉందని ఆ మధ్యన వినిపించింది. అయితే ఇపుడు ఆ టూర్ ఫిక్స్ చేసుకున్నట్లుగా ఉంది.

ఇపుడు కాకపోతే మళ్లీ ఏపీలో ఎన్నికలు వస్తాయి కాబట్టి వచ్చే ఏడాది మే జూన్ వరకూ కుదిరే అవకాశం లేనందున జగన్ విదేశీ టూర్ పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.ఇక జగన్ తో పాటు ఈ కేసులలో నిందితుడుగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విజయసాయిరెడ్డి యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్, సింగపూర్ తదితర విదేశీ పర్యటనలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. సీబీఐ కోర్టు అనుమతి ఇస్తే సెప్టెంబర్ నెలలో జగన్ యూకే టూర్ ఉంటుందని అంటున్నారు.