Begin typing your search above and press return to search.

సగానికి సగం లేచి పోవాల్సిందే...జగన్ మార్క్ షాక్ ?

వైసీపీకి భారీ ఓటమి పలకరించి ఆగస్టు 4కి సరిగ్గా రెండు నెలలు అయింది.

By:  Tupaki Desk   |   4 Aug 2024 11:30 PM GMT
సగానికి సగం లేచి పోవాల్సిందే...జగన్ మార్క్  షాక్ ?
X

ఏపీలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలు అయింది. వైసీపీ ఘన విజయం ఘోర ఓటమి అయిదేళ్ల పాలన పూర్తిగా సంక్షేమం మీదనే ఆధారపడి అభివృద్ధిని వదిలేయడం ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో కేసు స్టడీగానే ఉంటాయని అంటున్నారు.

వైసీపీకి భారీ ఓటమి పలకరించి ఆగస్టు 4కి సరిగ్గా రెండు నెలలు అయింది. వైసీపీ ఈ మధ్యలో ఏమి చేసింది అధినాయకత్వం ఏ విధంగా ముందుకు రావాలని చూస్తోంది అన్నది ఎపుడూ చర్చగానే ఉంటోంది. వైసీపీ పడి లేచిన కడలి తరంగం ఒకనాడు. ఇపుడు లేచి పాతాళానికి పడిపోయిన విషాదంగా మారింది.

వైసీపీని మళ్ళీ పట్టాలెక్కించేందుకు గాడిన పెట్టేందుకు ఏమి చేయాలన్నది ఆ పార్టీ ఆలోచిస్తోందా అన్నది కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. గెలుపు లో కాదు ఓటమి లోనే సత్తువ తెలిసేది అని అంటారు. అందువల్ల వైసీపీ ఈ డిజాస్టర్ నుంచి తిరిగి లేచి కోలుకుంటుందా అన్న చర్చ అయితే తీవ్ర స్థాయిలో పార్టీ లోపలా బయటా సాగుతోంది.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా తన తీరుని మార్చుకుంటోంది అని వార్తలు వస్తున్నాయి. కోటరీని పక్కన పెట్టి నేరుగా క్యాడర్ తో లీడర్లతో చర్చలు జరిపి వారి మనసు ఎరిగి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆలోచితోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఇటీవల ఎన్నికల్లో ఎన్నో ప్రయోగాలు చేసింది. అవి కాస్తా ఘోరంగా వికటించాయి.

పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్ లో ఏకంగా ఎనభై మంది దాకా మార్చేశారు. జంబ్లింగ్ విధానంలో వారిని వీరుగా చేశారు. ఇలా ఎంత మార్చినా కూడా వైసీపీకి ఘోరా పరాభవం మాత్రం తప్పలేదు. మరో వైపు చూస్తే ఇపుడు పార్టీ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం అని అంటున్నారు.

వైసీపీ జిల్లా కమిటీలు పెద్దగా యాక్టివ్ గా లేవు. వాటికి కార్యవర్గాలు ఉన్నాయో లేవో ఉంటే పనిచేస్తున్నాయో లేవో కూడా తెలియదు. మొత్తం 26 జిల్లాలలోనూ పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో పునర్ నిర్మించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.

అందులో సగానికి సగం అంటే 12 జిల్లాలలో కార్యవర్గాలను మార్చేసి కొత్త వారిని నియమిస్తారని అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అన్న మాట. ఎక్కడ ఎవరిని నియమించాలో కూడా జగన్ ఆయా జిల్లాల పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పార్టీలో టోటల్ గా టాప్ టూ బాటం ప్రక్షాళన దిశగా అధినాయకత్వం కదులుతోందని అంటున్నారు. పార్టీలో చురుకైన వారు సమర్ధులు గట్టి నేతలను తీసుకుని వారికే జిల్లా పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి దాకా పార్టీలో మార్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక వైసీపీకి కొత్త రూపు తీసుకుని రావాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ క్రమంలో పార్టీలో పనిచేయని వారు సీనియర్లు ఎవరైనా ఉంటే వారికి భారీ షాకులు తప్పవని అంటున్నారు. అలాంటి వారిని పూర్తిగా సైడ్ చేయాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. 2026 ప్రారంభంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నయి. అంటే గట్టిగా ఏణ్ణర్థం సమయం ఉంది.

ఇప్పటి నుంచి పార్టీని రెడీ చేస్తేనే తప్ప లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ తయారు కాదు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక జగన్ జిల్లా పర్యటనలు చేయడం పార్టీ పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేయడం అటు క్యాడర్ తో పాటు ఇటు ప్రజలతో మమేకం కావడం వంటి యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో భారీ మార్పులు ఎవరికి ఎసరు పెడతారో చూడాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో వైసీపీ ప్రక్షాళన కార్యక్రమం పార్టీని ఏ దిశకు చేరుస్తాయో వెయిట్ అండ్ సీ.