Begin typing your search above and press return to search.

జగన్ బర్త్ డే స్పెషల్... ఒక్క చిత్రం ఎన్నో క్లారిటీలు!

ఈ సమయంలో తాజాగా డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక అపురూప చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:50 AM GMT
జగన్  బర్త్  డే స్పెషల్... ఒక్క చిత్రం ఎన్నో క్లారిటీలు!
X

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు. చిత్రానికి ఉన్న ప్రత్యేకత అటువంటిది. అందుకే ఆ చిత్రం చెప్పే భావాలు జనం మెదల్లలో అలా నిలిచిపోతాయి. ఉదాహరణకు జగన్ పాదయాత్ర సమయంలో విజయవాడ వంతెన, రాజమండ్రి బ్రిడ్జ్ లపై అప్పట్లో తీసిన ఫోటోలు చెప్పాల్సిన విషయాన్ని స్పష్టం చెప్పాయి. ఈ సమయంలో తాజాగా డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక అపురూప చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది.


అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని అక్కున చేర్చుకుంటున్నారు అన్న థీమ్‌ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యం వచ్చిందనడానికి ఇవి సంకేతాలనేది తెలిసిన విషయమే!


ఇదే సమయంలో... వైఎస్ జగన్ పాలనలో చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే.. ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కల్లా బండచాటున నిల్చుని చూస్తున్నట్టున్న ఉన్న ఈ చిత్రం వైఎస్సార్సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ శ్రేణులంతా రేపటి వాట్సప్ స్టేటస్ గా ఈ ఫోటోను అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు పుష్కలం!


ఇదే సమయంలో... రాష్ట్రంలో సమకాలిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేస్తున్నాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరువ చేసిందనే చెప్పాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సామాన్యులు తమ ఫోన్ స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్ లలో సోషల్ మీడియా హ్యాండిల్స్ సేవ్ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.


ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా ఫొటోను తమ వాట్సాప్, సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్స్‌ గా పెట్టుకోవడంతోపాటు షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈనెల 21న సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది!