Begin typing your search above and press return to search.

డెబ్బై రోజులు : బాబు...జగన్ నోట ఒకే మాట...!

ఏపీలో ఎన్నికలు ఎపుడు వస్తాయి అంటే డెబ్బై రోజులు అని సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే మాట చెప్పారు

By:  Tupaki Desk   |   28 Jan 2024 3:37 AM GMT
డెబ్బై రోజులు : బాబు...జగన్ నోట  ఒకే మాట...!
X

ఏపీలో ఎన్నికలు ఎపుడు వస్తాయి అంటే డెబ్బై రోజులు అని సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే మాట చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే విషయం చెప్పారు. చిత్రమేంటి అంటే అది కూడా ఒకే రోజున ఇద్దరూ చెప్పడం. జగన్ విశాఖ జిల్లా భీమిలీలో జరిగిన సిద్ధం సభలో మాట్లాడుతూ మరో డెబ్బై రోజులలో ఎన్నికలు ఉన్నాయని తేల్చేశారు.

ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో చంద్రబాబు కూడా డెబ్బై రోజులలో ఏపీలో ఎన్నికలు వస్తాయి, వైసీపీ ప్రభుత్వం గద్ది దిగడం ఖాయమని చెప్పారు. సరే ఈ ఇద్దరూ చెప్పిన డెబ్బై రోజులను తీసుకుంటే ఎన్నికల డేట్ కరెక్ట్ గా ఎపుడు అన్నది అంచనా వేయవచ్చు. జనవరి నెల ఎటూ ముగిసిపోతోంది.

ఇక ఫిబ్రవరి, మార్చి నెలలు మాత్రమే మధ్యలో ఉన్నాయి. అంటే ఈ రెండు నెలలూ కలిపి అరవై రోజులుగా ఉంటాయి. డెబ్బైలో అరవై తీసేస్తే ఇక మిగిలింది పది రోజులు. అంటే బాబు జగన్ కలసి ఇచ్చిన డేట్ ఏప్రిల్ పది అన్న మాట. అంటే ఈసారి ఎన్నికలు ఏప్రిల్ 10న ఏపీలో జరుగుతాయన్న మాట.

ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు రెండు నెలల ముందు రిలీజ్ అవడం కూడా మామూలే. పైగా లోక్ సభ ఎన్నికలు కూడా జత కలుస్తున్నాయి కాబట్టి రెండు నెలల వ్యవధిలో షెడ్యూల్ ప్రకటించి ఆ మీదట ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు.

అంటే అన్నీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి 10 తరువాత ఎప్యుడైనా లోక్ సభ తో పాటు ఏపీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. దానికి మరో కారణం కూడా ఉంది. పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతున్నాయి. అవి కాస్తా పది రోజుల పాటు సాగి ఫిబ్రవరి తొమ్మిదితో ముగుస్తాయి.

అవి అలా ముగియగానే ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదిన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఏపీలో జగన్ ఎన్నికల సభలు శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే భారీ సభలు ఏపీలో అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

చంద్రబాబు కూడా రా కదలిరా అన్న పేరిట సభలు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఒకసారి రిలీజ్ అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లే అవుతుంది. దాంతో ప్రతీదీ ఖర్చుగానే ఎన్నికల సంఘం చూస్తుంది. సీఎం జగన్ అయినా చంద్రబాబు అయినా హెలికాప్టర్లలో వచ్చిన ఖర్చు నుంచి పర్తీదీ కౌంట్ చేస్తారు. అలాగే భారీ బహిరంగ సభల వ్యయం మొత్తం ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల మీద పడిపోతాయని కూడా అంటున్నారు.

అదే విధంగా అనేక రకాలైన ఆంక్షలు నిబంధలను ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని భారీ బహిరంగ సభలను వీలైనంతవరకూ ఫిబ్రవరి 10లోగా ముగించాలని అటు జగన్ ఇటు చంద్రబాబు చూస్తున్నారు అని అంతున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.