ఈ 'లుక్' మారింది.. మరి ఆ 'లుక్' మాటేంటి జగన్?!
ఏపీ మాజీ సీఎం జగన్.. కొత్త లుక్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 2 July 2024 3:30 PM GMTఏపీ మాజీ సీఎం జగన్.. కొత్త లుక్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల అనంతరం.. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామాతో మాజీ సీఎం కనిపించారు. జగన్ ఇప్పటి వరకు కుర్తా ధరించినట్టు ఎక్కడా చూడలేదు. వేడుకల్లోనూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ప్యాంటు-షర్టుతోనే కనిపించేవారు.
అంతేకాదు.. ఎప్పుడూ ఆయన వైట్ షర్ట్.. లైట్ గోధుమ రంగు ప్యాటునే ధరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం తాజా లుక్లో కనిపించడంతో జగన్ అభిమానులు మురిసిపోతున్నారు. ` మా నాయకుడు లుక్ మార్చాడోచ్!``అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. ఇంత వరకుబాగానే ఉన్నా..అసలు మార్చాల్సిన `లుక్` పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా ఉంది. ఓటమి భారం నుంచి ఆయన తేరుకున్నా.. సమస్యలుమాత్రం ముందున్నాయి.
నాయకులను ధైర్యంగా ముందుకు నడిపించడం.. క్షేత్రస్థాయిలో తప్పులను సరిదిద్దడం, బలమైన అధికార పక్షాన్ని అసెంబ్లీలో ఎదుర్కోవడం.. చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడడం.. పార్టీని ముం దుకు నడిపించడం వంటి అనేక సమస్యలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ముందుగా వీటిని పరిష్కరిం చాల్సి ఉంది. అయితే.. గతంలో మాదిరిగా.. ఇప్పుడు కూడా.. ``నా అంతటివాడిని నేను`` అనే విధంగా వ్యవహరిస్తారా? లేక.. తనను తాను మార్చుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
బాహ్య సౌందర్యం .. లుక్ ఎలా ఉన్నా.. ఇప్పుడు మానసిక సౌందర్యం జగన్కు అత్యంత ముఖ్యం. అది లేకే.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో.. ఈ లుక్ కన్నా.. ఆ లుక్పైనే ఎక్కువమంది చర్చ చేస్తున్నారు. తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లేనని.. వాదిస్తూ.. ముందుకు సాగిన ఫలితంగా.. తగిలిన దెబ్బలు ఆయనలో మార్పు తెస్తాయా? అసలైన కొత్త లుక్ చూస్తామా? అనేది ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.