జగన్ 2024లో మళ్ళీ గెలిస్తే పక్కాగా జరిగేది అదే ...?
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే 2024లో జగన్ మళ్ళీ సీఎం కావడం తధ్యం. ఆయన సీఎం ఇలా అవగానే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 19 July 2023 3:46 AM GMTరాజకీయాలు అంటే సేవా భావం అని ప్రజల కోసం అని ప్రజల కు మేలు చేసేందుకు అన్నది ఒక పక్కకు క్రమంగా జరిగిపోతోందా అన్న చర్చ వస్తోంది. ఇపుడు ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా ప్రజల కు ఇచ్చే హామీలు ఒక ఎత్తు అయితే వాటికి మించి మేము అధికారం లోకి వస్తే ప్రత్యర్ధుల కు ఇలా చేస్తాం అలా చేస్తామంటూ భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
ఏపీ లో అది నిరంతరాయంగా కోనసాగుతోంది. టీడీపీ వారు అయితే ప్రత్యేకంగా అందరి లెక్కలూ చిట్టా పద్దులు ప్రతీ రోజూ రాసుకు ని ఉంచుతున్నారని ఆ పార్టీ వారే చెబుతున్నారు. చినబాబు లోకేష్ పాదయాత్రలో తిరుగుతూ అన్న మాటలు ఏంటి అంటే తాము అధికారం లోకి వస్తే వైసీపీ నాయకులు అమెరికా లో ఉన్నా లేక అనకాపల్లిలో ఉన్నా కూడా తెచ్చి తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు కూడా ఇంచుమించుగా అలాగే చెబుతున్నారు. తాము అధికారం లోకి వస్తే పార్టీని తమకు ఇబ్బందుల పాలు చేసిన వారి ని వదిలేది లేదని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తాట తీస్తాం, తోలు తీస్తాం, వీధుల లో ఊరేగిస్తాం అని అంటున్నారు. ఇదంతా అధికారం లోకి తాము వస్తే చేస్తామని చెప్పడమే.
వైసీపీ అయితే ఇపుడు అధికారం లో ఉంది. ఆ పార్టీ ప్రత్యర్ధులను వదలడంలేదనే విపక్షాలు ఇలా విరుచుకుపడుతున్నాయి. అయితే ఇపుడు కాదు అసలు సినిమా 2024 తరువాత అని వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రి అంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే 2024లో జగన్ మళ్ళీ సీఎం కావడం తధ్యం. ఆయన సీఎం ఇలా అవగానే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అంటున్నారు.
కొందరి అకౌంట్స్ ని జగన్ సెటిల్ చేస్తారు అని నర్మగర్భ వ్యాఖ్యలు మంత్రి గారు చేస్తున్నారు. మరి ఆ కొందరు ఎవరు ఏ పార్టీ వారు లేక ప్రతిపక్షాలు అన్నీ నా అన్నది చూడాల్సిందే అన్నదే మంత్రి గారి మాటల వెనక ఉన్న సందేశం.అనుకోవాలి. ఇక జగన్ మీద పవన్ కళ్యాణ్ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని మంత్రి మండిపడ్డారు.
పవన్ అలా మాట్లాడడం వెనక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అంతే కాదు జగన్ని ఎవరు తిట్టినా కూడా వారిని పాతాళానికి తొక్కేస్తారన్న సంగతిని తెలుసుకోవాలని కూడా కొట్టు సత్యనారాయణ అనడం విశేషం. చరిత్ర మళ్లీ పునరావృత్తం అవుతుందని, జగన్ గెలిచిన తరువాత ధర్మం గెలిచింది అని అంటారని ఆయన చెబుతున్నారు. జగన్ ఈసారి గెలిస్తే మాత్రం మామూలుగా ఉండదని ముందే మంత్రి గారు చెప్పేశారు.
ఇప్పటిదాకా విపక్షాలు తాము ఏపీ లో గెలిస్తే వైసీపీ ని ఆ పార్టీ నేతలను ఏదేదో చేస్తామని అంటూ వచ్చారు. ఇపుడు మంత్రి గారు స్వయంగా ఈ విషయాలు చెబుతున్నారు. మరి ఇది నిజంగా విపక్షాలకు గట్టి హెచ్చరికగానే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రతీకార రాజకీయాలు మంచివి కావు అని అంతా అనడమే తప్ప ఆచరణ లో మాత్రం అవి కనిపించడంలేదు అని అంటున్నారు.