కొత్త అస్త్రంతో జగన్ టార్గెట్... టీడీపీ ఓట్లకు గండి ?
ఎన్నికల రాజకీయం పీక్స్ కి చేరుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో పోరు ఒక రేంజిలో సాగుతోంది.
By: Tupaki Desk | 10 May 2024 3:56 AM GMTఎన్నికల రాజకీయం పీక్స్ కి చేరుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో పోరు ఒక రేంజిలో సాగుతోంది. జగన్ ని ఇబ్బంది పెట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇప్పటిదాకా టీడీపీ ప్రయోగించింది. దానికి వైసీపీ అలెర్ట్ అయి కౌంటర్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. టీడీపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిందని కేంద్రం తెచ్చిన చట్టం ఇదని కూడా చెప్పడమే కాదు డౌట్లు అన్నీ ఒక మీడియా ఇంటర్వ్యూలో జగన్ క్లారిఫై చేశారు.
ఇపుడు జగన్ వంతు అన్నట్లుగా ఉంది. జగన్ నెల్లూరు మీటింగ్ నుంచే జోరు పెంచారు. ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రంలోని బీజేపీ చెబుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే రద్దు చేసి పారేస్తారు.దీని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు అని రెట్టిస్తున్నారు.
ఆయన తాజాగా కర్నూల్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట నుంచి టీడీపీకి సరికొత్త డిమాండ్ వినిపించారు. మోదీ అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటే ఎన్డీయే నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు రావడం లేదు అని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల పట్ల చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమ మాత్రమే అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు.
ముస్లింల విషయంలో మోసం చేస్తూ మౌనంగా ఉంటారా లేక బీజేపీ నుంచి బయటకు వచ్చి మద్దతుగా నిలుస్తారా అని జగన్ ఒక అల్టిమేటం జారీ చేశారు. తాను అయితే ఆరు నూరు అయినా ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటాను అని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎందాకైనా వెళ్తామని కేంద్రాన్ని అడ్డుకుని తీరుతామని ఆయన అంటున్నారు.
చంద్రబాబు మాత్రం బీజేపీతో జట్టు కట్టి ముస్లిం ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన నిందిస్తున్నారు. ఇది నిజంగా టీడీపీకి ఇరకాటమే. ఏపీలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు వారి ప్రభావం చూపించే సీట్లు దాదాపుగా పాతిక నుంచి ముప్పయి దాకా ఉంటాయని ఒక అంచనా. రాయలసీమ లో ముస్లిం ల ప్రభావం ఎక్కువ. అలాగే కోస్తాలో వారు కొన్ని కీలక సీట్లలో ప్రభావం చూపుతున్నారు. ఉత్తరాంధ్రాలో విశాఖ వంటి చోట్ల వారి ప్రాభవం ఉంది. మొత్తం మీద చూస్తే సరైన సమయంలో జగన్ చంద్రబాబు మీద ప్రయోగిస్తున్న ఈ అస్త్రంతో టీడీపీ ఇరకాటంలో పడిందని అంటున్నారు.
ఏపీలో నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ముస్లిం రిజర్వేషన్ల మీద నేరుగా మాట్లాడలేదు.కానీ వారు తెలంగాళాలో గట్టిగానే చెబుతున్నారు. దాంతో సాటి పొరుగు రాష్ట్రంలో ఆ ప్రకటనల ప్రభావం ఏపీ మీద కచ్చితంగా ఉంటుంది. పైగా మోడీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని దేశమంతా చేస్తే ఏపీ కూడా అందులో ఉంటుందని అంటున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక టీడీపీకి అది ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.