Begin typing your search above and press return to search.

చంద్రబాబు వరుస శ్వేతపత్రాల వేళ జగన్ కీలక నిర్ణయం!?

ఏపీలో కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత.. గత ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ పై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 July 2024 4:44 AM GMT
చంద్రబాబు వరుస శ్వేతపత్రాల వేళ జగన్  కీలక నిర్ణయం!?
X

ఏపీలో కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత.. గత ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ పై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. జగన్ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ 50 రోజుల్లో ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్! ఇందులో శాంతిభద్రతలు అనేవీ మరీ హాట్ టాపిక్ గా మారాయి!

ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సమయంలో వైసీపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది. ప్రధానంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు ఉన్న సమాజ్ వాదీ పార్టీ మద్దతు దొరికింది.

ఇదే క్రమంలో... వివిద జాతీయ పార్టీల నాయకులు, ఎంపీలు జగన్ కు మద్దతుగా నిలవడంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా ఇండియా కూటమి నుంచి జగన్ కు మద్దతు లభించింది. దీంతో.. ఈ ధర్నా సక్సెస్ అయ్యిందని అంటున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్ లో జోష్ పెరిగిందని అంటున్నారు. ఈ సమయంలో జగన్ కూడా ఆ జోష్ తగ్గించకూడదని భావిస్తున్నారు.

అవును... ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఫలితంగా వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది! ఇందులో భాగంగా... నేడు జగన్ మీడియా ముందుకు రాబోతున్నారని అంటున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... తన ఐదేళ్ల హయాంలో తమ ప్రభుత్వం వివిధ సాఖలు, విభాగాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై జగన్ రియాక్ట్ అవ్వనున్నారని అంటున్నారు. ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాల అమలు, చేసిన అప్పులు మొదలైన విషయాలపై వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన, 2019-24 కొనసాగిన తన పాలన పనితీరుపై అంశాలవారీగా స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ ఫ్రెస్ కాన్ఫరెన్స్ కు జాతీయ మీడియానూ ఆహ్వానించారని అంటున్నారు. ఇదే సమయంలో... ఈ సమావేశంలోనే జగన్ కొన్ని కీలక ప్రకటనలు చెయబోతున్నారని.. ఇండియా కూటమి టాపిక్ కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది!