రాజ్యసభ ముగ్గురు అభ్యర్థులనూ అలా ఫైనల్ చేసిన జగన్!
అవును... రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2024 7:10 AM GMTత్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పటికే ఆరు జాబితాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభ సభ్యులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
అవును... రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఒకరు ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కాగా... జగన్ సామాజిక సమీకరణాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంలో ఇప్పటికే జగన్ ఒక క్లారిటీకి, కన్ క్లూజన్ కు వచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా బుధ, లేదా గురువారం నాడు వీరి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 8 న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో... ఆరోజు మధ్యాహ్నం అసెంబ్లీలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారని సమాచారం.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయాన్ని నోటిఫికేషన్ కు ముందే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు తెరపైకి వచ్చిన ముగ్గురు పేర్లలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు గతంలోనే ఖరారు చేశారు. అయితే, మూడో వ్యక్తికి సంబంధించి జగన్ గతకొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు.
మరోపక్క రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సైతం ఒక అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే... ఆ అభ్యర్థి పేరు ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తుంది. దీంతో... గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు.