జగన్ గ్రేట్ డేరింగ్ స్టెప్ ఇది...!
ఏపీ సీఎం జగన్ విషయంపై పబ్లిక్ టాక్ డిఫరెంట్‌గా ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన వేస్తున్న అడుగులపై పబ్లిక్‌లో భారీ ఎత్తున చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 6 Jan 2024 2:45 AM GMTఏపీ సీఎం జగన్ విషయంపై పబ్లిక్ టాక్ డిఫరెంట్‌గా ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన వేస్తున్న అడుగులపై పబ్లిక్‌లో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. సాధారణంగా ఏ అదికార పార్టీ అయినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చేందుకు చాలా వరకు అంగీకరించవు. అలా మారిస్తే.. పార్టీపై ప్రభావం పడుతుందని అనుకుంటాయి. గత 2019లో దేశవ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ మార్పుల దిశగా అడుగులు వేయలేదు.
దీంతో కాంగ్రెస్ మళ్లీ మళ్లీ వారికే టికెట్లు ఇచ్చింది. ఇది మోడీ సర్కారుకు మేలు చేసింది. అలాంటి పరిస్థితిని ఇప్పుడు అంచనా వేసిన.. సీఎం జగన్, తన వారిని ప్రక్షాళన చేస్తున్నారు. పైకి ఇది చూసేందు కు.. అన్యామని సిట్టింగులకు అనిపించవచ్చు. తమకు ఏదో చేస్తున్నారనే భావన కూడా ఉండి ఉండ వచ్చు. కానీ, మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోలేని వారికి.. ఇలా మార్పులు తప్పవనే సంకేతాలు అనేక రాష్ట్రాల్లోనూ రుజువైంది.
తెలంగాణలోనూ సిట్టింగులకు కొందరికి టికెట్‌లు దక్కని విషయం తెలిసిందే. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా.. సిట్టింగుల్లో కొందరిని పక్కన పెట్టాయి. ఇలా పక్కన పెట్టిన నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు ఫలితాన్ని రాబట్టుకున్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. మార్పులు అనేది ఈ పార్టీకి కొత్త కాదు. గత 2019 ఎన్నికల్లోనూ ఇలానే అనేక మార్పులు చేశారు. సిట్టింగుల గ్రాఫ్ బాగోలేదని చెప్పి.. వారు ఎంత ఒత్తిడి చేసినా.. పక్కన పెట్టారు.
దీంతో అప్పట్లోనూ వైసీపీపై విమర్శలు, నిరసనలు వచ్చాయి. కానీ, ఇలా మార్పులు చేసిన చోట.. కొత్త వారిని నిలబెట్టిన చోట కూడా వైసీపీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు కూడా ఇదే మంత్రం పఠిస్తోంది. సిట్టింగులపై జనంలో ఉన్న వ్యతిరేకతను ముందుగానే గమనించిన వైసీపీ.. ప్రజానాడికి అనుకూలంగా ముందుగానే అంటే.. మూడూ మాసాల ముందే మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా... కొత్త వారు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సమయం ఇచ్చినట్టు అయింది. ఇది పార్టీ మేలు చేస్తుందనేది మెజారిటీ పబ్లిక్ టాక్. మరి ఎలాంటి తీర్పు వస్తుందనేది వేచి చూడాల్సిందే.