షర్మిల కొడుకు వివాహానికి జగన్ దూరం...!?
సరిగ్గా నెల రోజుల క్రితం జనవరి 17న హైదరాబాద్ వేదికగా షర్మిల కొడుకు నిశ్చితార్ధం జరిగింది.
By: Tupaki Desk | 13 Feb 2024 2:30 AM GMTవైఎస్ షర్మిల కుమారుడి వివాహం ఈ నెల 17న రాజస్థాన్ లో జరగనుంది అని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం జనవరి 17న హైదరాబాద్ వేదికగా షర్మిల కొడుకు నిశ్చితార్ధం జరిగింది. ఆ వేడుకకు జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అయితే అక్కడ షర్మిల జగన్ పట్ల కొంత గ్యాప్ ని మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. అది మీడియాలో కూడా వైరల్ అయింది.
అప్పటికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నా ఏపీ బాధ్యతలు స్వీకరించలేదు. ఆ తరువాత 21న ఆమె ఏపీసీసీ చీఫ్ అయ్యారు. ఆ రోజు నుంచి ఆమె జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ అన్నను ఇంటికి పంపించాలని ఆమె జనం వద్ద డిమాండ్ పెడుతున్నారు. ఏపీలో ఆమె వైసీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.
అంతే కాదు ఆమె ఏపీలో వైసీపీ ఓడిపోవాలన్న కసితో పర్యటనలు చేస్తున్నట్లుగా ఆమె ప్రచార సరళి చూసినా కనిపిస్తోంది. దీంతో అన్నా చెల్లెలు మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది అని అందరికీ తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో షర్మిల కుమారుడి వివాహానికి జగన్ వెళ్తారా అన్నది ఇపుడు చర్చగా ఉంది.
ఏపీలో చూస్తే వైసీపీ వర్సెస్ షర్మిలగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. దాంతో పాటుగా చూస్తే నిశ్చితార్ధం వేడుకల వేళ షర్మిల జగన్ పట్ల సరిగ్గా వ్యవహరించలేదు అన్న వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ వెళ్ళే అవకాశాలు తక్కువ అని అంటున్నారు.
సరిగ్గ అదే రోజున అంటే 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను వైసీపీ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనుంది. వైసీపీ మార్క్ సిద్ధం సభల సిరీస్ లో ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని అంటున్నారు. ఈ సభ మీద వైసీపీ చాలా ఫోకస్ చేస్తోంది. ఒక విధంగా వైసీపీ రాజకీయాన్ని ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పే సభగా దీన్ని చూస్తున్నారు. అందుకే జగన్ ఈ సభలో పాలుపంచుకోవడం ద్వారా ఏపీలోని మొత్తం ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ ఈ నెల 18న సిద్ధం సభను నిర్వహిస్తున్న సమయంలోనే రాజస్థాన్ లో షర్మిల కొడుకు వివాహం జరగడం విశేషం. దాంతో జగన్ హాజరయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవని ప్రచారం సాగుతోంది. ఇక జగన్ వ్యతిరేకులు అంతా ఆ వివాహానికి తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఏ విధంగా చూసినా జగన్ వెళ్లడం అన్నది వీలు పడేది కాదని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం అఫీషియల్ గా అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ప్రత్యర్ధులుగా ఏపీ పొలిటికల్ తెర మీద కనిపించడం ఖాయమని అంటున్నారు.