చూడు జగన్.. పని చేయడమే కాదు.. చేసినట్టు.. చూపించాలి..!
ఈ విషయంలో ఏ పార్టీ ప్రభుత్వం ముందుంటుందనే దానిని బట్టి కీలకంగా మారుతుంది.
By: Tupaki Desk | 28 Jun 2024 10:30 AM GMTపనిచేయడం కళకాదు. కష్టపడితే.. పని అయిపోతుంది. కానీ, ఒక్కొక్కసారి పనిచేసినా.. కూడా గుర్తింపు రాదు.. ఇలాంటి సమయంలోనే.. పనిచేసినట్టు చూపించాలి. రాజకీయాల్లో ఉన్న నాయకులకు ఇది అ త్యంత అవసరమైన కళ! ఎందుకంటే.. నాయకులకు ప్రతిపక్షాలు ఎప్పుడూ.. చెక్ పెడుతూనే ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారనేది ఆచి తూచి అడుగులు వేస్తాయి. ఈ నేపథ్యంలోనే నాయకులు, ప్రభుత్వాలు కూడా.. కొంత మేరకు.. పనిచేసి.. ఎక్కువ మేరకు ప్రచారం కోరుకుంటాయి.
ఈ విషయంలో ఏ పార్టీ ప్రభుత్వం ముందుంటుందనే దానిని బట్టి కీలకంగా మారుతుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ఏదో చేయాలని అనుకోవడం.. ఏదో సాధించాలని అనుకోవడం కామన్. కానీ, అన్నీ చేసేం దుకు సమయం చాలకపోవచ్చు. ఐదేళ్లు అయిపోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎలా ముందుకు సాగాలి? అనేది చింత. ఇక్కడే పైన చెప్పుకొన్న టెక్నిక్‌ను చాలా మంది వినియోగిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. అయితే.. నిధులు సరిపోవడం లేదు.
ఈ విషయం తెలిసి.. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున యాగీ చేశాయి. దీంతో కేసీఆర్.. స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్‌కు వెళ్లారు. దీంతో ఇంకేముంది.. ప్రాజెక్టు పరుగులు పెడుతోంది.. అనే వాదన తెరమీదికి వచ్చింది. ఇలా.. పనిచేయడమే కాదు.. పని చేసినట్టు కూడా చూపించాలి. ఇదీ.. రాజకీయాల్లో నాయకుల కు ఉండే టాక్టీసు. కానీ.. ఈ విషయంలో మాత్రం.. వైసీపీ అధినేత జగన్ విఫలమయ్యారు. పని చేశారు. నాడు-నేడు ద్వారా బడుల రూపు రేఖలు మార్చారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ చేశారు. 104, 108 వాహనాలను విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. ఆరోగ్య శ్రీని కూడా బలోపేతం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును కూడా తీసుకువచ్చారు. నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇంత చేసినా.. ప్రచారం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రచారం అంటే.. ఆయన దృష్టిలో ఒక పత్రికకు ప్రకటన ఇచ్చి ఊరుకోవడమేనని అనుకుని ఉంటారు. కానీ, నిరంతరం ప్రజల మద్య ఉండడం.. విమర్శ వచ్చినప్పడు.. వాటిని వెంటనే ఖండించడం చేయాలి. కానీ, అలా చేయలేదు. ఫలితంగా పనిచేసినా.. ప్రయోజనం కనిపించకుండా పోయింది!!.