Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ముంగిట కేసీఆర్‌కు మేలు చేస్తున్న జ‌గ‌న్‌.. నెటిజ‌న్ల టాక్‌!

ఇప్పుడు ఏపీ స‌ర్కారే స్వయంగా చేసిన ప‌ని కేసీఆర్‌కు ఆయుధంగా మారుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:30 PM GMT
ఎన్నిక‌ల ముంగిట కేసీఆర్‌కు మేలు చేస్తున్న జ‌గ‌న్‌.. నెటిజ‌న్ల టాక్‌!
X

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఏ చిన్న సెంటిమెంటు దొరికినా.. దానిని ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ఆ రాష్ట్ర ముఖ్య‌మం త్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న వ‌ర్గంలోని కొంద‌రు మంత్రులు బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఓటేస్తే.. తెలంగాణ‌ను ఏపీలో క‌లిపేస్తారంటూ.. ప్ర‌చారం ప్రారంభించారు. ఇది ఒక‌ర‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు సెంటిమెంటును రెచ్చ‌గొట్ట‌డ‌మేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఇదిలావుంటే, ఇప్పుడు ఏపీ స‌ర్కారే స్వయంగా చేసిన ప‌ని కేసీఆర్‌కు ఆయుధంగా మారుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

ఇది ప్ర‌త్య‌క్షంగా కేసీఆర్ కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌నే అంచ‌నాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తు న్నాయి. ఈ నెల 4న కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఏపీ, తెలంగాణ‌కు సంబంధించిన కృష్ణా జ‌లాల వినియోగంపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్ర‌జ‌లు, రైతాంగం, సాగునీటి యంత్రాంగం కోరుకుంటున్న విధంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతాల్లో మాత్ర‌మే నీటిని వినియోగించుకునే లా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఇది తెలంగాణ‌లో బీజేపీకి బూస్ట్ ఇస్తుంద‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో కృష్ణాజలాల వినియోగంపై ఇప్ప‌టికే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యున‌ల్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ప‌క్క‌న పెడుతూ.. కొత్త‌గా ప‌రిశీలించి.. తెలంగాణ డిమాండ్‌కు అనుకూలంగా నిబంధ‌న‌లు మార్చాల‌నే ఉద్దేశం ఉంది.

దీంతో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యున‌ల్ గ‌డువును కూడా కేంద్రం పెంచింది. ఇది.. ఏపీకి శ‌రాఘాతంగానే మారింది. ఎందుకంటే. కేవ‌లం కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతాల‌కే ఈ నీటిని ప‌రిమితం చేస్తే.. గాలేరు-న‌గ‌రి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల‌కు చుక్క‌నీరు రాదు.

దీంతో జ‌గ‌న్ స‌ర్కారు కేంద్ర నిర్ణ‌యంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది. ఇది ఒక‌ర‌కంగా మంచిదే అయినా.. తెలంగాణ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు కూడా జ‌గ‌న్ స‌ర్కారు వేచి చూడ‌డ‌మే చ‌ర్చ‌ నీయాంశంగా మారింది. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ రిట్ వేయ‌డం ద్వారా.. కేసీఆర్ ఇప్పుడు కృష్ణాజ‌లాల‌ను కాపాడుకోవాలంటే.. త‌మ‌నే గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చే అవ‌కాశం ఉంది.

త‌న ప్ర‌భుత్వ‌మే ఉండాల‌ని, కృష్ణా జ‌లాల కోసం తాము ఎంతో కాలంగా పోరాడుతున్నామ‌ని ఒక సెంటిమెంటును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీ య వ‌ర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీల‌కు ఓటేస్తే.. అవి సుప్రీంలో పోరాడ‌బోవ‌ని, ఏపీలోనూ వాటికి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న కొత్త‌వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. అంటే.. ఒక ర‌కంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కేసీఆర్‌కు మేలు చేస్తుంద‌ని అంటున్నారు.