Begin typing your search above and press return to search.

ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్!... ఇకపై ఆ టెన్షన్ ఉండదు కానీ...!

ఇందులో భాగంగా... ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు రంగం నుంచి స్వాధీనం చేసుకుని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌ కు అప్పగించింది.

By:  Tupaki Desk   |   29 May 2024 3:00 AM GMT
ఏపీలో మందుబాబులకు గుడ్‌  న్యూస్!... ఇకపై ఆ టెన్షన్  ఉండదు కానీ...!
X

వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2019లో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. దశలవారీగా మద్యం నిషేధాన్ని అమలు చేసే లక్ష్యంతో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు రంగం నుంచి స్వాధీనం చేసుకుని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌ కు అప్పగించింది.

ఇదే సమయంలో... మద్యం వినియోగాన్ని తగ్గించాలనే కారణంతో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను తగ్గించింది.. మద్యం ధరలను గణనీయంగా పెంచింది. ఈ సమయంలో రకరకాల బ్రాండ్లు రావడం, వాటిపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. దీనిపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై వివరణ ఇచ్చారు. అవి 2019 ముందు చంద్రబాబు అనుమతిచ్చిన బ్రాండ్లు అని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో.. ఏపీలోని వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులను తొలగించడంపై మాత్రం జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ లు లేదా యూపీఐ ప్లాట్‌ ఫారమ్‌ ల ద్వారా ఎటువంటి చెల్లింపులు ఆమోదించబడకుండా.. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతించబడ్డటంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసాయి.

ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం సంగతి అటుంచితే... చిన్న వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తున్న ఈ రోజుల్లో... వైన్ షాపుల ముందు మాత్రం నగదు కోసం జనాలు తెగ ఇబ్బందులు పడేవారు. దీంతో.. వైన్ షాపుల పక్కనే ఫోన్ పే చేస్తే కొంతమొత్తం కమిషన్ తీసుకుని నగదు ఇచ్చే వ్యాపారాలు ప్రారంభమైన పరిస్థితి!

అయితే తాజాగా ఆ సమస్యకు రాం రాం చెప్పింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా... ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో నగదు లావాదేవీలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఫోన్‌ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ ప్లాట్‌ ఫారమ్‌ ల ద్వారా డిజిటల్ చెల్లింపులు మాత్రమే మద్యం షాపుల్లో ఆమోదించబడుతుందని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో... గత ఐదేళ్లుగా నగదు చెల్లింపులకు అలవాటు పడిన చాలా మంది పేదలు స్మార్ట్‌ ఫోన్‌ లు లేక ఇంటర్నెట్ సదుపాయం కారణంగా డిజిటల్ చెల్లింపులు చేయలేకపోతున్నారని చెబుతుండగా... ఫోన్ పే లు స్వీకరించకపోవడం వంటి సమస్యలకు చెల్లుచీటి పాడటంపై మాత్రం చాలామంది హ్యాపీ ఫీలవుతున్నారని అంటున్నారు.

అయితే... ఏదో ఒక తరహా పేమెంట్ మాత్రం కాకుండా... అవసరమైతే యూపీఐ పేమెంట్, ఆ అవకాశం లేనివారి నుంచి నగదు చెల్లింపులు స్వీకరించేలా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు మందుబాబులు!